...

Manchu manoj marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి, అమ్మాయి ఎవరో తెలుసా?

Manchu manoj marriage: మంచు మనోజే రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఓసారి ప్రేమ పెళ్లి చేస్కున్న ఇతను.. గతంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మనోజ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. అప్పటి నుంచి సింగిల్ జీవితాన్ని గడుపుతున్న అతడు మరోసారి మింగిల్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు రెండో పెల్లి చేస్కోబోయేది ఈ అమ్మాయినే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

అయితే ఆ అమ్మాయి ఎవరో కాదండి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి సీతామల్ ఫండిలోని వినాయక విగ్రాహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మౌనిక రెడ్డి కూడా గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేస్కుంది. కానీ ఆ తర్వాత కొంత కాలానికే ఈమె విడాకులు తీసుకుంది. మరి వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Advertisement
Advertisement