Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి ప్రాణాంతకమా.. వస్తే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతుందా..?

Is thyroid disease dangerous, how can be cured with treatment
Is thyroid disease dangerous, how can be cured with treatment

Thyroid Disease : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరైతే కావాలని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం, లేట్ నైట్ రాత్రులు గడపడం, సమయపాలన లేని తిండి, రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలా అనేక కారణలున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫురుషులు, మహిళల్లో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారు సడెన్‌గా బరువు పెరగడం, తగ్గడం, శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనిచ్చవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Is thyroid disease dangerous, how can be cured with treatment
Is thyroid disease dangerous, how can be cured with treatment

థైరాయిడ్ వస్తే ఏం జరుగుతుంది : 
ఇటీవల కాలంలో ప్రతీ పది మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆడవారు అధికంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. జాబ్ చేసే అమ్మాయిలు, స్త్రీలలో గర్భధారణ, రుతుచక్రం వంటి కారణాల వల్ల హార్మోన్లు సరిగా విడదలవ్వగా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు. దీనికి రోజూ తీసుకునే మనం ఆహారంలో పోషకాహార లోపం, హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోవడమే ఈ వ్యాధికి కారణంగా తెలుస్తోంది. మనిషి నెక్ భాగంలో బటర్ ఫ్లై ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్​ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ప్రతీ కణంపైనా తన ప్రభావాన్ని చూపుతాయి.

Advertisement

Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి గురించి తెలియని వాస్తవాలివే..

దీంతో శరీరంలోని భాగాలు సవ్యంగా పనిచేస్తాయి. అయితే, థైరాయిడ్​ హార్మోన్​ ఉత్పత్తి ఎక్కువ, తక్కువ కాకుండా ఉంటేనే బెటర్. హోర్మోన్లు ఎక్కువ, తక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.దీంతో థైరాయిడ్ వచ్చిన వారు వెంటనే అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. థైరాయిడ్ వ్యాధి రెండు రకాలు.. హార్మోన్ ఎక్కువగా విడుదలైతే దానిని హైపర్​ థైరాయిడిజం, నార్మల్ లెవర్ కంటే తక్కువగా హోర్మోన్స్ విడుదలైతే దానిని హైపో థైరాయిడిజం అని పిలుస్తారు.

థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా ఉంటేనే శరీరంలో ప్రతీ అవయవం సక్రమంగా పనిచేస్తుంది. హైపో థైరాయిడ్ వలన జీవక్రియలు పాడయ్యే ఆస్కారం ఉంది. బాడీ వెయిట్ పెరుగుతుంది. వైద్యుల సూచన మేరకు సకాలంలో మెడిసిన్ వాడితే థైరాయిడ్​ సమస్యను అధిగమించొచ్చు. అంతేకాకుండా వైద్యుల సూచన మేరకు బయట ఫుడ్ తగ్గించి వెజిటెబుల్స్, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అయోడిన్ ఉండే పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. తరచూ వ్యాయామం చేయాలి. సరిగా నిద్ర పోవాలి. అన్ని సమయానుగుణంగా పాటిస్తే థైరాయిడ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Read Also : Thyroid: థైరాయిడ్ కేవలం ఆడవారికి మాత్రమే వస్తుందా?మగవారికి రాదా? నిపుణులు ఏమంటున్నారంటే?

Advertisement