Krishna Vamshi : తెలుగు సినీ రంగంలో క్రియేటిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం,.. వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కృష్ణ వంశీ. అయితే చంద్రలేఖ సినిమా తీస్తున్నప్పుడు హీరోయిన్ రమ్య కృష్ణతో ప్రేమలో పడ్డారు ఈ డైరెక్టర్. ఆ తర్వాత కొంత కాలానికి పెళ్లి కూడా చేస్కున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన భార్య రమ్యకృష్ణ రేంజ్ ని అందుకోవడానికి తాను చాలా కష్టపడతాడట. ఆమెతో రోజూ కాంపిటేషన్ ఉంటుందని చెప్పారు. నాలుగైదేళ్లుగా నేను కాస్త తగ్గినట్లున్నా… అప్పుడప్పుడూ మా మధ్య గ్యాప్ మా బంధాన్ని మరింత బలపడేలా చేస్తుందని తెలిపారు. అంటే వీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నట్లు వివరిస్తున్నారు.
ఆమె ప్రస్తుతం ప్రస్తుతం చెన్నైలో ఉంటోందని తనకు గ్యాప్ దొరికినప్పుడు తాను చెన్నై వెళ్తే.. ఆమెకు గ్యాప్ దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తుందట. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలిపాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. తమ అబ్బాయి రిత్విక్ చాలా షార్ప్ అని… చాలా యాక్టివ్ గా కూడా ఉంటాడని… తెలిపాడు. క్రాస్ బీడ్ కాబట్టే అంత షార్ప్ అంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.