Psycho wife: వివాహేతర సంబంధాలు.. ఓ మనిషి చంపడానికి, చనిపోవడానికి కారణం అవుతుంది. ఇలాంటి సంబంధాల వల్ల పచ్చటి కాపురాల్లో కూడా చిచ్చు రేగుతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్ర మ సంబంధానికి అడ్డొస్తున్నారని కట్టుకున్న వాళ్లను చంపడమో, కన్న వాళ్లను కాటికి పంపడమో, లేక పుట్టిన వాళ్ల ప్రాణాలు గాల్లో కలిపేయడమో చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఇలాంటి ఓ ఙటన చోటు చేస్కుంది.
తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది భర్త మర్మాంగాలపై వేడి నీటిని పోసి.. తనలోని రాక్షసత్వాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రాణిపేట జిల్లా కావేరి పాక్కంకు చెందిన ఎల్. తంగరాజ్, టి. ప్రియ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే తంగరాజ్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన పని చేస్తున్నాడు. వీరిద్దరు అన్యోన్యంగానే ఉండేవారు. కానీ కొన్ని రోజులుగా తంగరాజ్ ప్రవర్తనలో మార్పును గమనించిన ప్రియ.. తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనితెలుసుకున్న ఆమె భర్త ప్రైవేటు పార్ట్స్ పై వేడి నీళ్లు పోసింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.