Homeopathy : రోజురోజుకీ మారుతున్న జీవన శఐలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ మంది చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు షుగర్, బీపీలు సర్వ సాధారణం అయిపోయాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను దృష్టిలో ఉంచుకొని.. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రతత్లు తీసుకుంటూ వ్యాయామం, పరుగు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి నియమాలను అనుసరించాలి.
ముఖ్యంగా హోమియోపతి మందులను రొటీన్ గా తీస్కునే వారు.. మొదట్లో వాటిని సురక్షిత ప్రాంతాల్లోనే పెట్టుకుంటారు. కానీ కొన్ని సార్లు ఏం జరుగుతుందిలే అని భావించి అజాగ్రత్తగా ఎక్కడ బడితే అక్కడ పెట్టడం మొదలు పెడతారు. అయితే మీరు హోమియోపతి మందులను తెరిచి ఉంచకపోయినా, వాటిని ఉంచేటప్పుడు ఉష్ణోగ్రతల విషయంలో కూడా జాగ్రత్తలు తీస్కోవాలి.
హోమియోపతి మందులను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా అధిక వేడిలో ఉంచినట్లయితే వాటిని శరీరంలోకి తీసుకున్న తర్వాత ఆ మందుల నుంచి సైడ్ ఎఫెక్స్ ను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు హోమియోపతి మందులను పెర్ప్యూమ్స్, సెంట్లు, ఫేస్ పౌడర్లు వంటివి ఉన్న ప్రాంతాల్లో పెట్టరాదు.
Read Also : health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..