Nayanathara: నయనతార తల్లి కాబోతుందా.. వార్తల్లో నిజమెంత!

Nayanathara: హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేస్కున్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 9వ తేదీన మహాబలిపూరంలో అత్యంత సన్నిహుతులు, సినీ ప్రముఖల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం ఈ జంట తిరుమల వెళ్లి శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత లాంగ్ హనీమూన్ ట్రిప్ కు కూడా వెళ్లారు. రెండు, మూడు వారాల పాటు ఇష్టమైన ప్రదేశాల్లో ఏకాంతంగా గడిపారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన నయనతార ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. కాగా ఆమె అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. నయనతారకు వాంతులు అయ్యాయట. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెల్లారట. నయనతార పెళ్లి జరిగి రెండు నెలలు దాటిపోగా ఆమె గర్భం దాల్చి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు.

ఈక్రమంలోనే ఆమె వాంతులు చేస్కున్నారని భావిస్తున్నారు. త్వరలోనే ఆమె బుల్లి సూపర్ స్టార్ కి జన్మనివ్వడం ఖాయం అంటున్నారు. అయితే ఈ వాదన మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అజీర్తి కారణంగానే ఆమెకు వాంతులు అయ్యాయి అంటున్నారు. మరో వాదన ఏంటంటే స్కిన్ సమస్యతో బాధపడుతున్న నయనతార అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. అసలు విషయం ఏమిటనేది స్పష్టం కాలేదు. కొంత సేపు నయనతారను పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపారట వైద్యులు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel