Blaupunkt: జర్మనీ టెక్ కంపెనీ బ్లాపంక్ట్ భారత్ లో తన తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్లాపంక్ట్ అన్ని ప్రీమియం టీవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. స్మార్ట్ టీవీలో 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది బ్లాపంక్ట్ కంపెనీ. ఈ సేల్ ఫ్లిప్ కార్ట్ ఈ-కామర్స్ సైట్ లో ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు యానివర్సరీ సేల్ జరగనుంది.
ఈ ఆఫర్ లో 32 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు టీవీలు అందుబాటులో ఉన్నాయి. బ్లాపంక్ట్ కంపెనీకి చెందిన టీవీలకు మార్కెట్ లో మంచి రేటింగ్ ఉంది. 5 రేటింగ్ పాయింట్లకు 4.6 పాయింట్లు ఇస్తారు ఈ రంగానికి చెందిన నిపుణులు. బ్లాపంక్ట్ టీవీలను ప్రీమియం బ్రాండ్ లలో ఒకటిగా చూస్తారు టెక్ నిపుణులు. బ్లాపంక్ట్ పెద్ద కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ అందించే టీవీలు మాత్రం సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి. వెరీ రీజనబుల్ ప్రైస్ లో టీవీలను అమ్ముతోంది బ్లాపంక్ట్. భారత్ లో బ్లాపంక్ట్ టీవీలు దేశంలోనే అతి పెద్ద టీవీ మానుఫ్యాక్చరర్ అయిన SPPL ద్వారా తయారు అవుతున్నాయి.