ChaiSam : చైసామ్ గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన మురళీ మోహన్.. నాగ్ అడిగారనే చేశానంటూ!

ChaiSam : సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం అవుతోంది. కానీ, ఇంకా వారి గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సమంత – నాగ చైతన్య విడాకులు, వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు అని చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ షాకింగ్ విషయం బయట పెట్టాడు.

విడాకులు అయిపోయిన ఇంత కాలానికి ఆ సీనియర్ నటుడు స్పందించడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ జంటకు మురళీ మోహన్ ఉన్న సంబంధం ఏమిటి అనే ఆరా తీస్తున్నారు. అయితే వారిద్దరూ విడిపతున్నారని తెలిస్తే వారితో మాట్లాడే వాడినని అన్నారు మురళీ మోహన్. నాగ చైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు తన ఇంట్లోనే ఉండేవారట. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో తనకు కొన్ని అపార్ట్ మెంట్స్ ఉన్నాయని చెప్పారు మురళీ మోహన్. అందులో మూడు ఇళ్లను తన ఫ్యామిలీ కోసం స్పెషల్ గా కట్టించారట.

Advertisement

అందులో ఒకదానిని తనకు ఇవ్వాలని నాగ చైతన్య అడిగారట కానీ దానికి తను ఒప్పుకోలేదట. చైతూ తన తండ్రి వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో.. నాగార్జుననే స్వయంగా ఆ ఇంటిని ఇవ్వమని అడగడంతో కాదనలేక ఇచ్చానని చెప్పారు మురళీ మోహన్

Read Also : Samantha : సమంతపై ఘోరంగా నెటిజన్ల ట్రోల్స్.. ఎంతైనా ‘మామ‘ ఎఫెక్ట్.. వీడియో!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel