Srinu Vaitla : కూతుళ్లపై శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్.. ఏమంటున్నాడంటే?

Updated on: July 22, 2022

Srinu Vaitla : తెలుగు సినీ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే ఆయన భార్య రూప.. అతడితో విడాకులు కావాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె శ్రీను వైట్లకు, ఆయన కుటుంబానికి దూరంగా ఉంటోంది. అయితే వీరి ముగ్గురి కూతుళ్లు కూడా శ్రీను వైట్ల వద్దే ఉంటున్నారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. ప్రొఫెషనల్ గా మంచి కం బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ ఇదే సమయంలో పర్సనల్ లైఫ్ లో సమస్యలు రావడంతో.. సినిమా తీసే ప్రయత్నాలను మాుకున్నారు. తాజాగా కూతుళ్లతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Srini vaitla emotional post on his three daughters
Srini vaitla emotional post on his three daughters

జీవితం అందంగా ఉంటుంది కానీ.. మీ ప్రియమైన వారితో అది మరింత ఎక్కువ అందంగా ఉంటుందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. నా ముగ్గురు మస్కటీర్స్ లేని జీవితాన్ని ఊహించలేనంటూ శ్రీను వైట్ల రాసుకచ్చారు. ఓ విధంగా తనతోనే తన కూతుళ్లు ఉన్నారన్న విషయాన్ని ఈ పోస్టు ద్వారా శ్రీను వైట్ల అందరికీ తెలియజేశారనిపిస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel