...

Draupadi murmu : ద్రౌపది ముర్ముఘన విజయం.. భారీ మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నిక!

Draupadi murmu : భారత వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల నుండి ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు. భారత వ రాష్ట్రపతిగా ఆమె జులై న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత దేశానికి ఆమె రెండో మహిళా రాష్ట్రపతి. గిరిజన సామాజిక వర్గం నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన మొట్ట మొదటి వ్యక్తిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్బంగా ఆమెకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement

రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ద్రౌపది ముర్ముకు శాతానికిపైగా ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించినట్లు అయింది. మూడో రౌండ్ వరకు ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు పడ్డాయి. యశ్వంత్ సిన్హాకు 1058 మంది సభ్యులు ఓటు వేశారు. ద్రౌపది ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్ సిన్హాకు 2,61,062గా ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి ముర్ముకు 53.18 శాతం ఓట్లు సాధించారు. యశ్వంత్ సిన్హా 24 శాతానికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు కొందకు ఎంపీలు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముర్ము భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Advertisement

Read Also :  Hyd Metro Station : మెట్రోలో చిందులేస్తూ తగ్గేదేలే అంటున్న యువతి… మరో వీడియో పెట్టేసిందిగా..!

Advertisement
Advertisement