Pan-adhaar Link: ఆధార్, పాన్ లింక్ చేయలేదా.. రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సిందే!

Updated on: July 17, 2022

Pan-adhaar Link: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయమని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది దాన్ని పెడన చెవిన పెడ్తూ… లింక్ చేస్కోవట్లేదు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఆధార్ పాన్ కార్డుల లింకింగ్ ను పొడగిస్తూనే వస్తుంది. కానీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ ఆధార్ లింక్ చేస్కోకపోతే… ఫెనాల్డీ పడుతుంది. 2022 జూన్ 30 లేదా అంతకంటే ముందు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసినట్లయితే మీరు 500 రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అదే మసయంలో జులై 1, 2022 లేదా ఆ తర్వాత లింక్ చేసినట్లయితే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గడువులోగా అనుసంధానం చేయకపోయినా కార్డు యాక్టివ్ గానే ఉంటుంది.

ముందుగా ఆధార్-పాన్ లింక్ కోసం అభ్యర్థనను సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ఎన్ఎస్డీఎల్ పోర్టల్ ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత చాలన్ నెంబర్ 280 కింద ఉన్న ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు వర్తించే పన్నును ఎంచుకోండి. ఫీజు చెల్లింపు మైనర్ హెడ్ 500, మేజర్ హెడ్ 0021 కింద ఒకే చాలెన్ లో చేయడిందనే విషయం గుర్తుంచుకోండి. తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి. అప్పుడు పాన్ నెంబర్ ఎంటర్ చేసి అసెస్ మెంట్ సంవత్సరాన్ని ఎంచుకొని, మీ ఇంటి చిరునామాను నమోదు చేయండి. చివరగా స్క్రీన్ పై చూపడినా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రోసీడ్ క్లిక్ చేయాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel