Chanakya neethi: భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగ బంధంలో ఇద్దరూ సంస్కారవంతులుగా, నమ్మకస్తులుగా ఉండటటం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య తెలిపారు. ఇదిలేని పక్షంలో ఆ బంధంలో మాధుర్యం ఉండదని అన్నారు. అలాంటి సంబంధం భార్యాభర్తలిద్దరి జీవితాలను దెబ్బతీస్తుందని వివరించారు. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోయిన తర్వాత ఆ బంధం చాలా బలహీనం అవుతుందని.. అలా కనుక జరిగితే వారిద్దరూ కలిసుండటం కూడా కష్టమేనని వివరించారు. అంతే కాదండోయ్ పెళ్లికి ముందే భార్యకు వేరే వాళ్లతో సంబంధం ఉంటే… ఆమె పెళ్లి, భర్త ఎప్పటికీ భారంగానే కనిపిస్తాని చెప్పారు. అలాంటి స్త్రీలకు ఎంత ప్రేమించే భర్త అయినా శత్రువుతో సమానమేనని చెప్పారు.
భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పుడు అలవాట్లు, వ్యసనాల బారిన పడినా దాని పర్యవసాన్ని ఇద్దరూ అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. అంటే భర్త చేసిన తప్పుకు భార్య, భార్య చేసిన తప్పుకు భర్త శిక్ష అనుభవిస్తారు. అందుకే సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చెడు అలవాట్లను వదిలేయడం అవసరం. భార్యాభర్తలిద్దరూ తమ మధ్య విషయాలను ఇతరులతో అస్సలే పంచుకోకూడదు. అప్పుడే వారి బంధం బాగుటుంది.