Jamun benifits: ప్రకృతి మనకు అందజేసే చాలా పండ్లలో అనేక పోషక విలువలు ఉంటాయి. మరెన్నో రోగాలకు నివారణగా కూడా పని చేస్తాయి. ఏ పండ్లు తింటే దేనికి పరిష్కారమో తెలుసుకుంటే… మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అదే విధంగా నేరేడు పండ్ల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సృష్టిలో లభించే సకలమైన పండ్లలో నేరుడ పండ్లు ఒఖటి. పోషక పదార్థాలు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. దీన్ని మెడిసినల్ ఫ్రూట్ అని కూడా అంటారు. అంతటి అద్భుత ఔషధ గుణాలు ఉన్న ఈ పండును కచ్చితంగా తినాల్సిందే. అయితే ఈ పండు విషయంలో చాలా మందికి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దని చెబుతుంటారు. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిది కానే కాదు. అందులో వేసవి కాలంలో లభించే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా డయేరియా, అజీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే నేరేడు పండ్లు తీసుకున్న గంటల వరకూ నీళ్లు తాగకుండా ఉండాలి. నేరేడు పండ్లతో మీరు సులువుగా బరువు తగ్గించుకోవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. నేరేడు గింజల పౌడర్ ను పరగడుపును గోరు వెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే… అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.