Mahamrityunjaya mantram: మహా మృత్యుంజయ మంత్రం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే పరమ శివుడిని స్తుతించి, సాధన, జపం, తపస్సు, శివుని ప్రసన్నం చేసుకుని తీవ్రమైన రోగాల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు అకాల మృత్యుభయం తొలగిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహా మృత్యుంజయ మంత్రాన్ని దుష్ట గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగించడానికి, జీవితంగా ఆనందంగా గడిపేందుకు జపిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వవల్ల మరణం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా విజయం సాధించవచ్చని నమ్ముతారు. ఇందులో ప్రత్యేకించి శివుని స్తుతి స్తోత్రం చేస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కల్గే లాభాల గురించి ఇప్పుడు తలుసుకుందాం.
మహామృత్యుంజయ స్తోత్రం..
ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||
ఆయుష్షు పెరగాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, సంపద, తేజస్సు, ఒక వ్యక్తి గౌరవం పొందాలన్నా కచ్చితంగా ఈ మహా మృత్యుంజయ స్తోత్రాన్ని చదవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సంతాన సమస్యలతో బాధపడేవారు దీన్ని చదవడం వల్ల సంతాన ప్రాప్తి కల్గుతుంది.