Mahesh Babu : సమ్మర్ లో కూతురితో కలిసి వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న వీడియో…!

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక తాజాగా మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలైన మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మహేష్ బాబు కూతురు సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు, కుటుంబానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Mahesh Babu
Mahesh Babu

సోషల్ మీడియాలో సితారకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సితార అతి చిన్న వయసులోనే లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో సితార షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సితార తన తండ్రి మహేష్ బాబుతో కలిసి రోడ్డు మీద వాకింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ” సమ్మర్ వాక్ విత్ నాన్న.. ఫర్‌ఎవెర్ మై ఫేవరేట్ ” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో మహేశ్ బాబు సరదాగా తన కూతురితో కలిసి నవ్వుతు మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తున్నాడు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా మహేశ్ బాబు, ఆయన కూతురు షేర్ చేసిన ప్రతి విషయం నిమిషాలలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోయింగ్ అటువంటిది మరి. ఇటీవల సితార గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మహేశ్ బాబు తన తర్వాత సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఎప్పుడూ పట్టలెక్కుతుందో చూడాలి మరి.

Read Also : Mahesh Babu : ఆ సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేశ్ బాబు…!

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel