Sai pallavi: భానుమతి.. రెండు కులాలు, రెండు మతాలు.. ఒక్కటే పీస్.. డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె హీరోయిన్ గా మారే కంటే ముందు డ్యాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె చాలా గొప్ప డ్యాన్సర్. కానీ స్క్రీన్ మీద నటించే సమయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐటమ్ సాంగ్స్ తనకు సూట్ అవ్వవు అని చెప్పింది. అలాగే సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో కూడా నటించనని వివరించింది. అయినప్పటికీ ఆమె డ్యాన్స్, నటనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
చాలా మంది అభిమానులు సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్ ను చూసేందుకు వెళ్తుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాయి పల్లవి చేసే డ్యాన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. శరీరాన్ని ఎలా పడితే అలా స్ప్రింగులా తిప్పేయగలదు. సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు అక్కడ యూనివర్సిటీ ఓ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించింది. అందులో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ చూస్తే రెండు కళ్లు సరిపోవు. అంత అద్భుతంగా చేసిందీ ఈ నేచరల్ బ్యూటీ ఆ డ్యాన్స్ ని. ఇక ఆమె చేసిన డ్యాన్స్ వీడియో పాతదే అయినప్పటికీ… అదిప్పుడు వైరల్ గా మారింది.