Janaki Kalaganaledu Climax : అయ్యో.. క్లైమాక్స్‌లో జానకిరామ చనిపోతారట? వంటలక్క, డాక్టర్ బాబులానే.. బాబోయ్.. ఇదేం ట్విస్ట్..!

Janaki Kalaganaledu Climax : టీవీ సీరియల్ అనగానే ముందుగా అందరికి ఎక్కువగా కార్తీక దీపం (karthika deepam climax)   పేరు వినిపించేది. ఆ సీరియల్ టీవీ ప్రేక్షకులను అంతగా కట్టిపడేసింది. ఏదైనా ఒక టీవీ సీరియల్ ముందుకు సాగాలంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేయాల్సిందే.. కొత్త క్యారెక్టర్లు రావాలంటే పాత క్యారెక్టర్లను చంపేయాల్సిందే.. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది తెలుగు టీవీ సీరియల్స్‌లో.. ట్రాజెడీ లేకుండా సీరియల్ ముందుకు నడిచే పరిస్థితి లేదు.. ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్షన్ ఉండాల్సిందే.. అప్పుడే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.. అందుకే కాబోలు.. సాఫీగా సాగిపోతున్న కార్తీక దీపంలో ఫేమస్ క్యారెక్టర్లు అయినా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఎండ్ కార్డ్ పడింది.

Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy
Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy

ఎందుకంటే.. అప్పుడే కదా.. కొత్త తరానికి కొత్త క్యారెక్టర్లకు ఛాన్స్ దొరికేది.. కార్తీకదీపం అంటే.. అందరికి ముందుగా గుర్తొచ్చేది వంటలక్క.. డాక్టర్ బాబు.. అంత గొప్పగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. సీరియల్ కథను మలుపు తిప్పాలన్నా రేటింగ్ పెంచాలన్నా వీరిద్దరే.. అలాంటి వీరు (వంటలక్క, డాక్టర్ బాబు మృతి) లేకుండానే కార్తీక దీపం చప్పగా సాగుతోంది. వీరూ లేకపోయినా టాప్ ప్లేసులోనే దూసుకు పోతోందనుకోండి. కానీ, వీరు ఉన్నప్పుడు అంత కాదనే చెప్పాలి. ఏదిఏమైనా సీరియల్‌కు మూల స్తంభాలైన వంటలక్క, డాక్టర్ బాబు లేకుండానే కార్తీక దీపాన్ని చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదే ట్రెండ్‌లో… మరో తెలుగు సీరియల్..
ఇప్పుడు ఇదే ట్రెండ్ మరో తెలుగులో సీరియల్ కొనసాగించబోతోంది. కార్తీక దీపం మాదిరిగానే మెయిన్ క్యారెక్టర్లకు ముగింపు పలకబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సీరియల్‌లోనూ లీడ్ క్యారెక్టర్లు చనిపోతారని చూపించబోతున్నారట.. ఇంతకీ ఆ సీరియల్ ఏంటంటే.. ‘జానకి కలగనలేదు..’ ఇప్పుడు రాబోయే ఎపిసోడ్‌లలో జానకి, రామ పాత్రలకు ఎండ్ కార్డ్ వేయబోతున్నారట.. అంటే.. ఈ సీరియల్‌లో జానకీ, రామ చనిపోతారట.. ఇదేం ట్విస్ట్ అంటే.. అది అంతే.. కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే.. మెయిన్ క్యారెక్టర్లను ముగించాల్సిందే అన్నట్టు కనిపిస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ జానకి కలగనలేదు సీరియల్‌ కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కార్తీక దీపం సీరియల్ మాదిరిగానే ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ పెరిగింది.

Advertisement
Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy
Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy

మౌనరాగంలో నటించిన ప్రియాంక జైన్ పాత్ర ఎంతగా హిట్ అయిందో ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్ లోనూ జానకిగానూ అద్భుతంగా నటిస్తోంది. ఎంతో హుందాగా అచ్చు తెలుగు ఇంటి అమ్మాయిలా ఒదిగిపోయింది. అందుకే తెలుగు ఆడియోన్స్ జానకి పాత్రకు అంతగా కనెక్ట్ అయ్యారు. ఇందులో ప్రియాంక జైన్ జానకిగా కనిపిస్తే.. అమర్ దీప్ చౌదరి రామచంద్రగా తనదైన నటనతో అలరిస్తున్నాడు. ఇప్పటికే మూడు వందలు దాటేసిన ఈ సీరియల్ ఎపిసోడ్ ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతోంది.

అసలు ఈ సీరియల్‌లో జానకి అనే క్యారెక్టర్.. ఒక ఐపీఎస్ కావాలనుకునే అమ్మాయి.. ఆమె అనుకోని పరిస్థితుల్లో స్వీటు షాపు నడిపే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. చదువుకున్న కోడలంటే ఇష్టం లేని తల్లిగా జ్ఞానాంభ (రాశి) కనిపించగా.. అమ్మ మాట జవదాటని కొడుకుగా రామ పాత్రలో ఒదిగిపోయాడు అమర్ దీప్. ఈ సీరియల్‌లో ఒకవైపు తన భార్య ఐపీఎస్ కలను నిజం చేయాలనే భర్తగా రామచంద్ర తపిస్తుంటే.. మరోవైపు.. అత్తమ్మకు ఇష్టం లేని తన ఐపీఎస్ కలని వదిలేసుకోవాలని చూస్తుంది జానకి.. అలాంటి మూడు క్యారెక్టర్ల మధ్య భర్త సహకారంతో జానకి తన కలను సాకారం చేసుకుంటుందా? లేదా అనేది ‘జానకి కలగనలేదు’ సీరియల్ అసలు కథ..

హిందీ సీరియల్ రీమేక్ ఇది :
జానకి కలగనలేదు.. అనే స్టోరీ ముందుగా హిందీలో ప్రసారమైన ‘దియా ఔర్ బాటి హమ్’ సీరియల్‌‌ నుంచి వచ్చింది. ఆ హిందీ సీరియల్‌ స్టోరీ మన తెలుగులో రీమేక్‌ ‘జానకి కలగనలేదు’గా వస్తుంది. గతంలో ‘దియా ఔర్ బాటి హమ్’ సీరియల్‌ను ‘ఈతరం ఇల్లాలు’గా తెలుగులో డబ్ చేశారు. అప్పట్లో ఈ సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా అదే హిందీ సీరియల్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Advertisement
Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy
Janaki Kalaganaledu Climax _ Janaki Kalaganaledu Telugu Serial Full Story And Climax Twist End With Tragedy

అసలు స్టోరీ ఇదే..
హిందీ స్టోరీని చూస్తే.. ఈ సీరియల్‌లో హీరో హీరోయిన్లు పెద్ద బాంబు పేలుడు ప్రమాదంలో చనిపోతారు. అంతకంటే ముందు ఆ హీరోయిన్ ఐపీఎస్ అవుతుంది. పిల్లలతో పాటు చదువురాని తన భర్తని గొప్పవాడిగా తయారుచేస్తుంది. ఇవన్నీ సీన్స్ అయ్యాక.. పూర్తి పీఎస్ అఫీసర్‌గా ఆమె ఒక స్ట్రింగ్ ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. అందులో తన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంది. ఆ సమయంలో భర్త కూడా ఆమె వెంట వెళ్లడం జరుగుతుంది. అదే సమయంలో సీరియల్ బాంబు పేలుడు జరుగుతుంది. ఆ ప్రమాదంలో ఆ ఇద్దరూ చనిపోతారు.. అంతే.. ఈ సీరియల్‌కు ఆ ఇద్దరి క్యారెక్టర్లకు ఎండ్ కార్డు పడినట్టే..

క్లైమాక్స్‌ ట్రాజెడీనా.. హ్యాపీనా..? :
ఇప్పుడు తెలుగులో ప్రసారమవుతున్న జానికి కలగనలేదు సీరియల్లో కూడా జానకి, రామాలు చనిపోతారా? అనేది పెద్ద ట్విస్ట్‌గా మారింది. హిందీలో స్టోరీ మాదిరిగానే.. కార్తీక దీపంలో వంటలక్క, డాక్టర్ బాబు మాదిరిగానే.. జానకి కలగనలేదులోనూ ఇదే ట్రాజెడీతో ఎండ్ అవుతుందా? లేదో చూడాలి. మన దగ్గర విషాదాన్ని పెద్ద జీర్ణించుకోలేరు.. ఏ సీరియల్ క్లైమాక్స్ అయినా హ్యాపీగా ముగిస్తేనే మన తెలుగు ప్రేక్షకులు తీసుకోగలరు.. మరి ఈ సీరియల్ క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

Read Also : Janaki Kalaganaledu May 27 Today Episode : జ్ఞానాంబ ఇంట్లో కన్నబాబు.. టెన్షన్ లో జానకి రామచంద్ర..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel