Student interaction with cm jagan: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టంపై కొందరు అనసవర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. రేష్మా అనే పదో తరగతి విద్యార్థఇని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామిలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని తెలిపింది.
అలాగే అనుదీప్ అనే విద్యార్థి మాట్లాడుతూ… నేను ఐఏఎస్ అయ్యే వరకూ మీరే సీఎంగా ఉండాలంటూ తెలిపాడు. బాలుడి మాటలు విన్న సీఎం నవ్వుల్లో మునిగితేలారు. అలాగే మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. దాని వల్లే తాము అంత బాగా ఇంగ్లీష్ నేర్చుకోగల్గుతున్నామని వివరించింది.
Read Also : AP CM Jagan : ఏలూరు అగ్నిప్రమాద బాధితులకు 25 లక్షల నష్ట పరిహారం..!