Viral video: ఒక్కొక్కరి బుద్ధి ఒక్కోలా ఉంటుంది. కొందరు చావునూ కూడా పండగలా చేస్తారు. మరికొందరు పెళ్లిని కూడా సంస్మరణ సభలా కానించేస్తారు. అందుకో పుర్రెలో బుద్ధి.. జిహ్వకో రుచి అనే సామెత వాడుకలోకి వచ్చింది. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైన పార్టీలోనో జోష్ తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించి తర్వాత సభలో డ్యాన్సులు చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అది కూడా సాధా సీదా డ్యాన్స్ కాదు బెల్లీ డ్యాన్స్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
చనిపోయిన ఓ వ్యక్తికి నివాళి సభ ఏర్పాటు చేశారు. మరణించిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కుటుంబసభ్యులు ఆ సభను ఏర్పాటు చేశారు. ఈ నివాళి సభకు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు వచ్చారు. ఇరుగు పొరుగు వారూ ఆ సభకు హాజరయ్యారు. అంతా ప్రశాంతంగా సాగుతోంది. అందరూ ఆ వ్యక్తి గురించి గుర్తు చేసుకుంటూ తమ బాధను వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఎవరూ అనుకోని ఓ ఘటన జరిగింది. సల్మాన్ ఖాన్ నటించిన పోకిరీ సినిమాలోని ఐటెం సాంగ్ ప్లే అయింది. స్టేజీ మీదకు ఒక అమ్మాయి వచ్చి డ్యాన్సులు ఇరగదీసింది. బెల్లీ డ్యాన్స్ తో ఊపేస్తూ డ్యాన్స్ తో అల్లాడించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.