Chanakya neethi: ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే.. దురదృష్టం వెంటాడినట్లే.. జాగ్రత్త సుమీ!

Chanakya neethi: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధఇంచిన అనేక సమస్యలను.. వాటి పరిష్కారాలు గురించి వివరించాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం… ప్రతి వ్యక్తి జీవితంలో చెడు సమయాలు వస్తాయి. అది రాబోతున్నప్పుడు దాని సంకేతాలు కచ్చితంగా కనిపిస్తుంటాయి. అలాంటి సంకేతాలు ఏమిటి, వాటి వల్ల కలిగే అనర్థాలు ఏమిటో అనేది తెలుసుకుందాం.
ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా కీడు జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు.

Advertisement

తలసి ఆకులను హిందూ మతంలో చాలా పవిత్రమైనవి పరిగణిస్తారు. మన ఇంట్లో రోజూ గొడవలు జరిగితే ఇంట్లో లక్ష్మీ దేవి నివసించదు. దీని వల్ల ఇంటి ఆర్థిక పరిస్ఖితి క్షీణించడమే కాకుండా ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడమే కాకుండా ఇంటి ప్రశాంతత కూడా పోతుంది. దీంతో పాటు ఇంట్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరగడం పెద్ద అనర్థానికి కారణం. పెద్దలను గౌరవించని ఇంట్లో ఎప్పడూ అదృష్ట దేవత ఉండదట. పెద్దలను అవమానిస్తే.. ఇది రాబోయే వినాశనానికి సంకేతమట. అలాగే క్రమం తప్పకుండా పూజలు చేయకపోతే కూడా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి.. కీడు జరిగేందుకు కారణం అవుతుందట.

Advertisement