Road accident in mathura: యూపీ, మహారాష్ట్రల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి!

Road accident in mathura: ఉత్తర ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శినివారం వేకువ జామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్ ప్రెస్ వేపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని ముథురా జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా నోయిడాలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే మహారాష్ట్రలో టవేరా వాహనం ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఉమ్రేద్​ మార్గ్​లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. టవేరా అతివేగంతో ప్రయాణించి ట్రక్కును ఓవర్​టేక్​ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel