Saami Saami song : ఏడు పదుల వయసులో కూడా సామి.. సామి అంటూ రష్మికను మించిపోయి డాన్స్ చేసిన బామ్మ .. వీడియో వైరల్!

Saami Saami song : పుష్ప సినిమా గత ఏడాది విడుదలయ్యే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని డైలాగులు పాటలకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాలోని డైలాగులు పాటలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి సుమారు ఐదు నెలలు అయిపోయిన ఇప్పటికీ పుష్ప ఫీవర్ తగ్గలేదని చెప్పాలి.

old-lady-doing-dance-to-the-rashmika-swami-swami-song-video-goes-viral
old-lady-doing-dance-to-the-rashmika-swami-swami-song-video-goes-viral

ఇప్పటికే ఎంతోమంది సినిమాలో పాటలకు సంబంధించిన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాలో రష్మిక చేసిన సామి సామి అనే పాటను ఏడుపదుల వయసులో కూడా ఓ బామ్మ ఎంతో అద్భుతంగా చేశారు. రష్మికను మించి వృద్ధురాలు డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చూడటానికి ఎంతో బక్క పలచగా ఉన్న ఈ బామ్మ ఎనర్జీ లెవెల్ మాత్రం పీక్ అని చెప్పాలి.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Advertisement

ఈ క్రమంలోనే ఈ బామ్మ రా రా సామి.. బంగరు సామి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసింది.ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బామ్మ ఎనర్జీ లెవెల్స్ చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వయసులో కూడా ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ బామ్మ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బామ్మ డాన్స్ వీడియో పై ఓ లుక్కేయండి.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel