Horoscope: మే నెలలో మేష రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: మే నెల 2022లో మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈ నెలంతా చక్కగా ఉంది. భూ లాభంతో పాటు ఆర్థిక లాభాలు కూడా అధికంగా ఉన్నాయి. స్నేహితులు, బంధువుల వల్ల ధన ప్రాప్తి ఉంది. అంతే కాకుండా విదేశాలకు వెళ్లాలి అనుకునే వాళ్లు ఈ నెలలో నిస్సంకోచంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం… ఇలా దేని కోసమైనా సరే మీరు విదేశాలకు వెళ్లి తీరుతారు. పర్సనల్ లోన్స్, హోం లోన్స్ గురించి ప్రయత్నించే వారు ఈ నెలలో అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్లు పొందుతారు.

చాలా కాలంగా వివాహం కాని వారు ఈ నెలలో ప్రయత్నిచడం వల్ల కచ్చితంగా వివాహం అవుతుంది. అయితే ముఖ్యంగా భాగస్వాములతో అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు అబిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గొడవలు పెద్దవయ్యే సూచనలున్నాయి. వాహనాలు నడిపే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel