Doctor negligence: చనిపోయిందని శ్మశానానికి తీసుకెళ్లారు.. కానీ చివరి నిమిషంలో!

ఐదు రోజుల శిశువుకు ఆరోగ్యం బాగాలేదని కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. లక్ష రూపాయల ఫీజు అయ్యే వరకు అక్కడ ఉంచుకున్న వైద్యులు… ఫీజు కట్టగానే పాప చనిపోయిందంటూ ఇంటికి పంపించి వేశారు. అయితే పాప ప్రాణాలతో లేదని శ్మశానానికి తీసుకెళ్లారు. కానీ శ్మశానానికి వెళ్లాక పాపలో కదలికలు వచ్చాయి. ప్రాణంతోనే ఉందని గ్రహించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

వివరాళ్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు కోరుట్లకు చెందిన సంగీతతో వివాహం జరిగింది. అయితే ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది సంగీత. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్ఖితి విషమంగా ఉందని చెప్పడంతో… కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. లక్ష రూపాయల వరకు ఫీజు వేసిన ఆస్పత్రి పాప చనిపోయింది ఇంటికి తీసుకెళ్లండని సూచించారు. కానీ శ్మశానానికి వెళ్లాక పాపలో కదలికలు కనిపించాయి. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా… చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని.. పాప బానే ఉందని చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సబ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel