బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన కూతురు ఐరా గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అంత ఆస్తి, అందం ఉన్న ఆమె… ఓ వింత వ్యాధితో బాధపడుతోందట. ఈ రోగం వల్ల తనను ఎంతగానో బాధపడాల్సి వస్తోందని సోషల్ మీడియా ద్వారా ఆమెనే తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా తన బాధను వివరించింది. అయితే ఐరా ఖాన్ ను వెంటాడుతున్న రోగం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరా ఖాన్ యాంగ్జైటీతో బాధపడుతుందట. అయితే గతంలో తనకెప్పుడూ యాంగ్జైటీ లేదని… కానీ ఇప్పడు పట్టుకుందని వివరించింది. దీని వల్ల చాలా ఉద్వేగానికి లోనవుతుంటానని తన బాధను వెల్లడించింది. “ఈ జబ్బు వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్ లక్షణాలు. అవి చాలా మెల్లమెల్లగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది” అని చెప్పింది.