RRR movie dosthi song : ఆర్ఆర్ఆర్ దోస్తీ పాట విడుదల.. క్షణాల్లోనే లక్షల వ్యూస్!

RRR movie dosthi song :దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మార్చి 25వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఓవైపు బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తూనే… మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా పేరొందుతోంది. అయితే ఈ సినిమాలోని రామ్​ చరణ్​ – తారక్ ల​ మధ్య సాగే దోస్తీ పాటకు ఫిదా అయ్యారు అభిమానులు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. విభిన్న ధృవాల మధ్య స్నేహం గురించి వివరించే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా కాలభైరవ ఆలపించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు.

RRR movie dosthi song
RRR movie dosthi song

అయితే తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్​ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే రిలీజ్ అయిన క్షణాల్లోనే ఈ పాటు లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇంకా ముందుకు దూసుకెల్తూనే ఉంది. ఇది వరకే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల పూర్తి వీడియో సాంగ్స్​ను మేకర్స్​ విడుదల చేశారు.

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel