Sri Hanuman : శ్రీరాముడు, సీత, లక్ష్మణుల పాత్రలు ఎంతనో.. శ్రీ ఆంజనేయుని పాత్ర కూడా అంతే ముఖ్యం. ఇక శ్రీరాముడు తన భార్య, తమ్ముడితో అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో రావణుడు సీతను అపహరించడంతో.. శ్రీరాముడు మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలోనే అడవిలో రాముడికి హనుమంతుని పరిచయం ఏర్పడటంతో.. అప్పటి నుంచి ప్రతి విషయంలో శ్రీరాముడి కష్టాలకు, సంతోషాలకు తోడుగా, నీడగా ఉన్నాడు.
శ్రీరాముడు తన సర్వస్వంగా భావించిన హనుమంతుడు.. ఏ రోజు కూడా శ్రీరాముని జవదాటలేదు. ఇక సీతను వెతుకుతున్న సమయంలో కూడా హనుమంతుని సహాయం చాలా ఉంటుంది. సముద్రంపై వారధి కట్టి శ్రీరాముడితో లంకేశ్వరుని పోరాటం చేయించాడు. అంతేకాకుండా సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి మూర్ఛిల్లిన లక్ష్మణుడిని కాపాడాడు. అలా ప్రతి విషయంలో శ్రీరాముని కుటుంబం కు అండగా నిలిచాడు హనుమంతుడు. అంతేకాకుండా శ్రీ రాముడు, సీతమ్మ లపై తనకున్న ప్రేమను తన హృదయాన్ని చీల్చి మరి చూపించాడు.
అలా రాముడి పై భక్తి చూపిస్తూ ఆయన వెన్నంటే నిలిచాడు. అయోధ్యకు సీతని తీసుకువచ్చిన రాముడు.. ఆయన పట్టాభిషేకం తరువాత.. ఇదంతా హనుమంతుని సేవల వల్లే జరిగిందని.. హనుమంత కారణంగానే సీత తిరిగి వచ్చిందని అనుకోని.. అన్ని వేళలా తనకు హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని పొంగిపోతాడు. అలా తన విజయం వెనుక హనుమంతుని పాత్ర ఉండటంతో.. వెంటనే శ్రీరాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.
ఇక అప్పటి నుంచి ప్రజలు శ్రీ రాముడి తో పాటు హనుమంతుని కూడా పూజించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఇక హనుమాన్ ని పూజించడం వల్ల ఎలాంటి భయాందోళనలు ఉండవు. శని బాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దరి చేరవు. ప్రతి విషయంలో ధైర్యం వస్తుంది. ఇక ఆయనకు 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు 5 ప్రదక్షిణలు చేయటం వల్ల అంత మంచే జరుగుతుంది.
Read Also : Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి