...

Litre Petrol for one rupee: రూపాయికే లీటర్ పెట్రోల్ అంట.. ఎక్కడో తెలుసా?

చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలకు పైగానే ఉంది. అప్పటి నుంచి చాలా మంది వాహనాలను నడపాలంటేనే భయపడిపోతున్నారు. అంతకు ముందు దగ్గర్లో ఉన్న ప్రదేశాలకు వెళ్లాలన్నా బైకులను వాడే వాళ్లు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. మరీ దూరం అయితే తప్ప ఇంట్లో నుంచి బండిలను తీయడం లేదు. కాళ్లతో నడిచి వెళ్తూ.. పనులు చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్ ధరలు ఇంత ఎక్కువవండతోనే అంతా ఇలా చేస్తుండగా… రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామంటే జనాలు ఎలా ఎగబడి ఉండారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు.

Advertisement

Advertisement

అయితే మహారాష్ట్రలోని సోలాపూర్ పెట్రోల్ బంక్ యాజమాన్యం అంబేడ్కర్ జయంతి సందర్బంగా రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించింది. ఈ వార్త తెలుసుకున్న వందలాది మంది వాహనదారులు పెట్రోల్​ బంక్​కు పోటెత్తారు. గురువారం 500 మందికి ఒక్కొక్కరికి లీటర్ చొప్పున పెట్రోల్​ ఇచ్చింది. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సామాన్యులకు పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు బంక్ యాజమాన్యం తెలిపింది.

Advertisement
Advertisement