...

Bomb in Vizag Train : రైళ్లో బాంబు పెట్టాం.. ప్రాణాలు కాపాడుకోండంటూ ఆగంతకుడి ఫోన్!

Bomb in Vizag Train : విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టాం.. మీకు చేతనైతే రైళ్లో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడండి అంటూ ఓ ఆగంతకుడు 100 డయల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తో రైల్వే రక్షక దళం, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ రైలు నడిపే లోకో పైలెట్లకు చెప్పి రైలును ఆపేశారు. బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి తనిఖీలు చేశారు. కాజీపేటలోని ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​, చర్లపల్లి వద్ద కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు.

Advertisement
Bomb in Vizag Train
Bomb in Vizag Train

రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు. ఎంత సేపు వెతికినా ఆ రైళ్లో ఎటువంటి బాంబు దొరకలేదు. చివరకు అది ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు. అప్పటి వరకు టెన్షన్ పడ్డ పోలీసులు, అధికారులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉన్న పలంగా రైలు ఆపి.. పోలీసులు సోదాలు చేయడం చూసిన ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. చివరకు పోలీసులు ఏం కాలేదు.. తరచుగా జరిగే సోదాలే ఇవని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చున్నారు.

Advertisement

Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్‌’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!

Advertisement
Advertisement