Four Days Work : వారంలో 4 రోజులే పని.. ఆ విధానం వైపే అందరి మొగ్గు..!

Four Days Work : ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థల్లో వారంలో ఐదు రోజులే పని సాగుతోంది. శని వారం, ఆది వారాలు సెలవు. అయితే ఈ మధ్య నాలుగు రోజుల పని దినాల గురించి జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని దేశాల్లో వారంలో నాలుగు రోజుల పని దినాల విధానం అమలు అవుతోంది. మరి కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనియస్ కన్సల్టెంట్ అనే సంస్థ మన దేశంలో ఓ సర్వే చేపట్టింది.

వారంలో 4 రోజుల పని విధానం గురించి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో మెజారిటీ సభ్యులు 4 రోజుల పని విధానం వైపే మొగ్గు చూపారు. దీని వల్ల ఇటు వృత్తి జీవితానికి, అటు వ్యక్తిగత జీవితానికి న్యాయం చేయడానికి వీలు పడుతుందని అంటున్నారు. దీనితో పాటు పని ఒత్తిడిని అధిగమించేందుకు నాలుగు రోజుల పని విధానంలో వీలు అవుతుందని చెబుతున్నారు.

ఫిబ్రవరి 1 నుండి 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించినట్లు జీనియస్ కన్సల్టెంట్ సంస్థ వివరించింది. 1113 మంది యజమానులు, ఉద్యోగులు జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో భాగమైనట్లు తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సస్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, బీపీఓ, మానుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్… ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు సర్వేలో పాల్గొన్నట్లు పేర్కొంది. సర్వేలో భాగమైన ఉద్యోగులందరూ 4 రోజుల పనికి సై అనడం గుర్తించదగ్గ విషయం.

Read Also : Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?