Actor Balayya : పుట్టిన రోజునాడే చనిపోయిన నటుడు బాలయ్య..!

Updated on: April 10, 2022

Actor Balayya : ప్రముఖ నటుడు బాలయ్య పుట్టిన రోజు నాడే చనిపోవడం బాధాకరం. శనివారం ఉదయం హైదారాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. పుట్టిన రోజు నాడే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కెరీర్​లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చాటిన బాలయ్య గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఏప్రిల్ 9వ తేదీ 1930లో పుట్టిన ఆయన 2022 ఏప్రిల్ 9వ తేదీన మరణించాడరు. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాతే సినీ రంగంలోకి వచ్చారు. దాదాపు 300క పైగా చిత్రాల్లో నటించారు.

Read Also : Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోటిన్నర వరకు స్వాహా!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel