October 5, 2024

Bongulo salt: బొంగులో చికెన్ గురించి తెలుసు కానీ… ఈ బొంగులో ఉప్పేంటి?

do you knwo bongulo salt cost

బొంగులో చికన్ గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ బొంగులో ఉప్పు గురించి చాలా మందికి తెలియదు. అయితే అన్ని ఉప్పులో ఈ ఉప్పు సులువుగా దొరకదండోయ్.. దాదాపు ఒక్కో కిలో ఉప్పుకు 750 ధర ఉంటుంది. ఈ రకం ఉప్పుకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. మున్ముందు పావు కిలో బొంగులో ఉప్పు ధర 10 వేల రూపాయలు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఉప్పుకు ఎందుకు అంత ధర, దీన్ని ఎలా తయారు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు పేరు బాంబూ సాల్ట్. దీన్నే పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుస్తుంటారు. కొరియన్ సంప్రదాయంలో ఈ ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. అయితే సముద్రపు ఉప్పును వెదురు బొంగుల్లో వేసి దాన్ని సిరామిక్ రకం బంక మన్నుతో మూసేస్తారు. తర్వాత 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. దీంతో బొంగులోని ఖనిజ లవణాలు, బొంగు నుంచి వచ్చే నూనె ఉప్పులో కలిసిపోతాయి. దాదాపు 14 నుంచి 15 గంటలు కాలిస్తే బొంగు మొత్తం కాలిపోయి కేవలం ఉప్పు ముద్దు మిగులుతుంది. దీన్ని మళ్లీ పొడి చేసి బొంగులో వేసి కాలుస్తారు. ఇలా అనేక సార్లు కాల్చడం వల్ల రంగు మారి గట్టి రాయిలా తయారవతుంది. తర్వాత దీన్ని పొడి చేసి అమ్ముతారు. అయితే బొంగులో ఉప్పు వాడటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందని, చర్మం మెరుగవుతుందని అనేక ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ ఉప్పుకు డిమాండ్ ఎక్కువ.