TSPSC Groups: గ్రూప్స్ నియామక పరీక్షలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవట..!

భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 80 వవేలకు పైగా పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో గ్రూప్ వన్ పోస్టులు 503 కాగా… గ్రూప్ టూ ఉద్యోగాలు 582, గ్రూప్ త్రీ కాటగిరీలో 1373, గ్రూప్ ఫోర్ కింద 9 వేల 168 పోస్టులున్నాయి. ఇందులో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతి ఇచ్చింది. అయితే అన్ని పోస్టుల నియామకానికి ఇటర్వ్యూలు లేకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆచోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గ్రూప్ టూ లోని కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు లేకపోగా.. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలో 75 మార్కులు ఉన్నాయి. గ్రూప్ వన్ పోస్టులకు ఇంటర్వ్యూలో వంద మార్కులు ఉంటాయి. అయితే అన్నింటికి ఇంటర్వ్యూ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం మార్కుల ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక చేపట్టాలని యేచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel