...

Every Three Years Marriage : మూడేళ్లకొకసారి విడాకులు, మళ్లీ పెళ్లి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Every Three Years Marriage : ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన మూడేళ్లకే అంటే 2019లోనే విడాకులు తీసుకున్నారు. మళ్లీ వెంటనే కలిసిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకి అంటే 2022లో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. మల్లీ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే వీరెవరు, అసలు అలా ఎందుకు చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి మూడేళ్లకోసారి విడాకులు తీస్కోవడం.. మళ్లీ వెంటనే పెళ్లి చేసుకోవడం వారికి అలవాటు అయిపోయింది. అయితే ఈ జంట జపాన్ దేశస్థులు. జపాన్ దేశంలో పెళ్లైన భార్యాభర్తలు ఇద్దరికీ ఒఖే ఇంటి పేరు ఉండాలనే చట్టం ఉంది. అది అమ్మాయిది అయినా కావచ్చు, అబ్బాయిది అయినా కావచ్చు. అయితే ఈ జంటకు మాత్రం ఎవరి ఇంటి పేర్లు వారికే కావాలని పట్టు పట్టారు. అయితే ఇంత చిన్న విషయం కోసం విడిపోవడం ఇష్టం లేక…  ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.

ఒక మూడేళ్లు అమ్మాయి ఇంటి పేరును.. మరో మూడేళ్లు అబ్బాయిని ఇంటి పేరును పెట్టుకోవాలనుకున్నారు. అయితే ఇలా మార్చుకోవడం జపాన్ రూల్స్ ప్రకారం సాధ్యం కాకపోవడంతో ముందు పెళ్లి చేసుకొని ఒకరి ఇంటి పేరును పెట్టుకుంటారు. ఆ తర్వాత మూడేళ్లకు విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మళ్లీ వేరొకరి ఇంటి పేరును పెట్టుకుంటారు. అయితే వీళ్లు కూడా ఇదే పాలసీని ఫాలో అవుతూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు.

Read Also : Krishna Tulsi Plant : ‘కృష్ణతులసి’ వేరుకు ఎంత పవర్ ఉందో తెలుసా.. జంటలు రాత్రుళ్లు అలసిపోవాల్సిందే..!