Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శశికళ అప్పు తీర్చడం కోసం తులసి ఎలా అయినాసరే ఇంటిని అమ్మాలి అని నిర్ణయించుకుంటుంది.అదే విషయం భాగ్య కి సర్ది చెప్పాలి అని అనుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా తులసి భాగ్య దగ్గరికి వెళ్లి మామయ్య గారి ఆపరేషన్ కోసమే కదా నేను అప్పు చేశాను ఆయన బతికించుకోవడం మనందరి బాధ్యత అని అనగా, అప్పుడు భాగ్య మామయ్య గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు నువ్వు మాజీ కోడలివి, నువ్వు కొడుకులకు చెప్పకుండా నువ్వే నిర్ణయాలు తీసుకొని, నువ్వే అప్పులు చేసుకున్నావ్ ఆ నిర్ణయాలకు పూర్తి బాధ్యత నీదే అంటూ అన్యాయంగా మాట్లాడుతుంది భాగ్య.
అప్పుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు తులసి అక్క అని అడగడంతో అప్పు తీర్చాలి అంటే ఇల్లు అమ్మాలి నాకు వేరే మార్గం లేదు దయచేసి అర్థం చేసుకో నేను మీ ఆయనతో కావాలంటే మాట్లాడతాను అని అనడంతో భాగ్య మొండిగా నేను వాటా విషయంలో రాజీ పడను అని అంటుంది. అప్పుడు తులసి నువ్వు లాస్య మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నావు.
నేను చెప్పిన విధంగా వింటే నీ చేతికి 20 లక్షలు ఇస్తాను. లేదు కోర్టు కి వెళ్తాను అంటే నీ ఇష్టం కోర్టు కి వెళ్ళినా కూడా నీకు వచ్చేది ఏమీ ఉండదు అని అంటుంది తులసి. దీనితో భాగ్య ఆలోచనలో పడుతుంది. మరొకవైపు లాస్య ఫోన్ చేసి తులసి వినద్దు అని చెబుతుంది. మరొకవైపు శృతి పని కోసం వెళ్లి వేరే ఇంటిలో పనిమనిషిగా చేరుతుంది.
ఆ ఇంట్లో రోజు పనిచేసే పని మనిషి రాములమ్మ ఆలస్యంగా రావడంతో కొత్త పనిమనిషిని పెట్టుకున్నాం అని అంటారు.. అప్పుడు రాములమ్మ ఈ వీధిలో నేను కాకుండా కొత్త పని మనిషి ఎవరు ఆయన బయటికి పిలు అనేసరికి అప్పుడు పని మనిషి గా ఎంట్రీ ఇస్తుంది శృతి. శృతిని చూసిన రాములమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మీరు పనిమనిషిగా చేయడం ఏంటమ్మా ఇది మీకు తప్పుగా అనిపించడం లేదా అని అనడంతో ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితుల్లో నాకు దీని కంటే వేరే మార్గం కనిపించడం లేదు అని అంటుంది శృతి. అనంతరం తాను పనిమనిషిగా చేస్తున్న విషయం ఎవరికీ చెప్పవద్దు అని రాములమ్మ తో మాట తీసుకుంటుంది శృతి. ఇక ప్రేమ్ ఇంటికి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది అని చెబుతాడు.
కానీ శృతి మాత్రం తాను పనిమనిషిగా చేసే విషయం చెప్పకుండా లోలో పల కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు అప్పు కోసం తులసి ఇంటికి వెళ్లిన శశికళ. అప్పు ఇస్తావా లేకుంటే ఇళ్ళు రాసిస్తావా అని నిలదీయడంతో తులసి ఇంటి రాయించడానికి నిర్ణయం తీసుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.