Guppedantha Manasu July 9 Today Episode : కళ్లు తిరిగి పడబోయిన వసు.. రిషి ఎలా రియాక్ట్ అయ్యాడు..? ఈరోజు ఇదే హైలెట్..!

Guppedantha Manasu July 9 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, సీరియస్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, సాక్షితో మాట్లాడుతూ చెప్పు సాక్షి ఏం కావాలి కాఫీ టీ అని అడగగా వెంటనే సాక్షి నాతో మాట్లాడటానికి కాసేపు టైం కావాలి అనడంతో సరే మాట్లాడు అని అంటాడు రిషి. ఆ తర్వాత సాక్షి సినిమాకి వెళ్దామా అని అనగా తర్వాత వెళ్దాం అని చెబుతారు. అప్పుడు సాక్షి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అప్పుడు రిషి సాక్షిని పిలిచి జీవితం చాలా విలువైనది ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ జీవితాన్ని పోగొట్టుకోకూడదు అని చెబుతాడు.

Guppedantha Manasu July 9 Today Episode

ఆ తర్వాత రిషి జగతి వసుధార పట్ల ప్రవర్తించిన తీరి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర గౌతమ్ ఇద్దరూ రిషి,వసు ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా వెళుతున్న వస్తారా కళ్ళు తిరిగి కింది పడిపోతూ ఉండగా మహేంద్ర గౌతమ్ వెళ్లి పట్టుకుని చెట్టు దగ్గర కూర్చోబెడతారు. అప్పుడు గౌతమ్ హాస్పిటల్ దగ్గరికి పిలుచుకొని వెళ్దాం అనగా వెంటనే వసు వద్దు అనడంతో సరే పద వసు నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మహేంద్రను అడగగా మహేంద్ర కారు తీసుకుని రాలేదు అనడంతో వెంటనే రిషి దగ్గరికి వెళ్తాడు గౌతంమ్.

రిషి,వసు గురించి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ అక్కడికి వచ్చి వసుధార గ్రౌండ్లో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు కారు కీస్ ఇవ్వు వెళ్ళి నేను డ్రాప్ చేసేస్తాను అని అనగా వెంటనే రిషికార్ కిస్ ఇచ్చి తొందరగా వెళ్ళమని చెబుతాడు. కానీ గౌతం మాత్రం తన మనసులో వసు,రిషి ని ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర కు మెసేజ్ చేసి ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు ప్లాన్ బి వర్కౌట్ చేద్దామని మెసేజ్ చేయడంతో మహేంద్ర కూడా ఓకే అని మెసేజ్ చేస్తాడు.

Guppedantha Manasu July 9 Today Episode : వసును ఇంటికి పంపిన రిషి.. రిషి గురించి ఆలోచిస్తూ వసు..?

అప్పుడు గౌతమ్ కావాలనే కింద పడినట్లు యాక్టింగ్ చేస్తాడు. వసు దిగబెట్టేందుకు నువ్వు వెళ్ళు అని చెప్పి రిషికి కార్ కీస్ ఇస్తాడు. మరొకవైపు మహేంద్ర,వసుధారని రిషి కార్లో కూర్చోబెడతాడు. ఇంతలో అక్కడికి రిషి వస్తుండడంతో అది గమనించిన మహేంద్ర ఏమి తెలియనట్టుగా నటిస్తాడు. అప్పుడు రిషి మహేంద్ర కార్ కిస్ ఇచ్చి వెళ్ళమని చెప్పగా మహేంద్ర అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రిషి పిలిచి నేను వెళ్తాను అని చెప్పి వసుని కారులో ఎక్కించుకుని వెళ్తాడు. ఇక ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా అప్పుడు వసుధార నిద్రలో గౌతమ్ సర్ సి సార్ కారు తీసుకుని వస్తే రిషి సార్ కి కారు ఎలా అనడంతో రిషి ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు రిషి ఎదురుగా వాహనం వస్తూ ఉండటంతో పదేపదే హారన్ కొడతాడు.

అప్పుడు వెంటనే వసుధార ఏంటి గౌతమ్ సార్ మీరు రిషి సార్ లాగా పదేపదే హారన్ కొడతారు అంటూ నిదానంగా కళ్ళు తెరవగా పక్కనే ఉన్న రిషి ని చూసి ఒక్కసారిగా సార్ అంటూ షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరూ కాసేపు కాస్త కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు మనసులలో ఒకే విధంగా ఆలోచిస్తూ మౌనంగా ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Read Also : Guppedantha Manasu july 8 Today Episode : సాక్షిపై విరుచుకుపడిన రిషి.. వసు గురించి టెన్షన్ పడుతున్న రిషి..?

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.