Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జానకి గురించి జ్ఞానాంబ మాట్లాడుతూ జానకీ అన్నంత పని చేస్తుంది. రామచంద్ర కు నిజంగానే విడాకులు ఇస్తుంది అని జ్ఞానాంబ అనడంతో అప్పుడు గోవిందరాజు జానకి సపోర్ట్ గా మాట్లాడతాడు. ఇంతలో మల్లిక మధ్యలో జోక్యం చేసుకోవడంతో మల్లిక ఫైర్ అవుతాడు గోవిందరాజు.
ఆ తర్వాత జానకి గురించి కాస్త నెగిటివ్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది జ్ఞానాంబ. ఆ తరువాత గోవిందరాజు ఇంటి బయట కూర్చుని జానకి గురించి జానకి గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడే మరొక కొత్త ప్లాన్ తో మల్లికా బయటకు వచ్చి జానకి దండె పై ఆరేసిన బట్టలు అన్ని విసిరేస్తుంది.
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న సామెతలు చెబుతూ జానకి లో మాటలతో హింసిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన గోవిందరాజు మల్లిక ను చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత గోవింద రాజు స్వయంగా తానే బట్టలు ఆరేసుకోవడానికి ఒక తాడు ని కడతాడు. ఆ తర్వాత జానకి, రామచంద్ర ఖర్చు కోసం కాస్త డబ్బులు తీసి జానకి చేతిలో పెడతాడు.
ఆ తర్వాత జ్ఞానాంబ చూసిందేమో అని జానకిని తిడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు గోవిందరాజు. మరోవైపు రామచంద్ర ఖార్జానాలో పని ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం భోజనం చేయలేకపోయానని ఈ భోజనం ఇంటికి తీసుకెళ్తే జానకి బాధపడుతుంది అనీ ఆ భోజనాన్ని ఒకచోట పడేస్తాడు.
అది చూసిన జ్ఞానాంబ నా కొడుకు తిండి తిప్పలు లేకుండా పని చేస్తున్నాడా అంటూ లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నాను నాన్న అంటూ రామ చంద్రని చూసి బాధపడుతూ ఉంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి రామచంద్ర లు రాత్రి ఇద్దరు కూర్చుని రొట్టెలు చేస్తుండగా అది చూసిన జ్ఞానాంబ, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తే ఇప్పుడు రొట్టెలు చేస్తుందా అంటూ జానకినీ అపార్థం చేసుకుంటుంది.
ఆ తర్వాత రామచంద్ర జ్ఞానాంబ భోజనం చేస్తూ భోజనం బాగుండడంతో అచ్చం అమ్మ లాగే చేసావు అని జానకి ఫోన్ చేసి చెబుతాడు. అది విన్న జ్ఞానాంబ నీకు ఎప్పటికీ తల్లి కడుపుకోత రానివ్వను అంటూ ఒక నిర్ణయం తీసుకుంటుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.