Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
అనసూయ, పరంధామయ్య లు వృద్ధాశ్రమంలో అన్నం తింటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే బాధపడుతూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య ఇంట్లో లాగా కాకుండా ఇక్కడ కడుపు నింపుకోవడానికి రెండు ముద్దలైన తినాల్సిందే అని అంటాడు. మరొకవైపు ప్రేమ్ అనసూయ దంపతుల కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ స్నేహితుడు ఫోన్ చేసి మీ నానమ్మ తాతయ్య ఆచూకీ తెలిసింది.
వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు అని చెప్పగానే వెంటనే ప్రేమ్ ఆనందంలో తన తల్లికి ఫోన్ చేయబోతాడు. అప్పుడు శృతి తులసి ఆంటీకి వద్దు మాధవి ఆంటీ కి ఫోన్ చెయ్ అని చెబుతుంది. ఇక వెంటనే ప్రేమ్ మాధవికి ఫోన్ చేసి చెప్పడంతో మాధవి సంతోషించి తులసి ని తీసుకొని ఆశ్రమానికి వెళుతుంది.
ఆశ్రమంలో అనసూయ దంపతులు తులసి తలచుకుంటూ తులసీ అయితే మనల్ని పువ్వుల్లో చూసి పెట్టుకునేది అంటూ బాధ పడుతూ ఉండగా, వారిని చూసిన తులసి కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తరువాత తులసి పరంధామయ్య కాళ్లు పట్టుకుని నన్ను క్షమించండి మామయ్యా అని అడుగుతుంది.
ఆ తర్వాత పరంధామయ్య వాళ్ళు మాకు ఆశ్రమంలో బాగానే ఉంది అని అనడంతో అప్పుడు తులసి మీరు ఇంటికి రాకపోతే నేను మీకోసం మీ ఆశ్రమం ముందు దీక్ష చేయడానికైనా సిద్ధం అని చెప్పడంతో అనసూయ దంపతులు తప్పక ఇంటికి వెళ్తారు. ఇదంతా కొంచెం దూరం నుంచి చూస్తున్న ప్రేమ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.
ఇక ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసి నందు ఎంతో సంతోషిస్తాడు. ఇక మీరు నాతో వచ్చేయండి అని అనడంతో వెంటనే తులసి, అత్త మావయ్య లు ఎక్కడికి రారు, నా తోనే ఉంటారు అని అంటుంది. అప్పుడు నందు కోపంతో అందుకే నేను నిన్ను వదిలేశాను అని అనడంతో, ఆ మాటకు సీరియస్ అయిన తులసి నువ్వు పరాయి ఆడదాని తో తిరుగుతుంటే నీ పద్ధతి నచ్చక నేనే వదిలేశాను అని అంటుంది.
ఆ తర్వాత తులసి ఎమోషనల్ తో భర్తగా మీరు పెద్ద ఫెయిల్యూర్ అని నందుని అనడంతో, అప్పుడు నందు భర్త లేకపోతే సమాజంపై ఎటువంటి విలువలు ఇస్తుందో నేను ఇల్లు దాటి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది అంటూ లాస్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.