Ys Jagan New Strategy : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు మాత్రమే పూర్తి చేసుకోగా, సీఎం జగన్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా వెళ్లాయట..
సరిగ్గా రెండేళ్ల ముందు నుంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం ప్రతిఒక్కరూ సిద్దంగా ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలియడంతో ప్రతిపక్షాలు కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
జగన్ సరికొత్త నినాదమే గెలిపిస్తుందట.. :
2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని నినాదంగా ఎంచుకున్నారు. అయితే, అధికారంలోకి వచ్చాక కేంద్రంతో పలుమార్లు ప్రత్యేక హోదా గురించిన చర్చించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్రం కూడా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్రమే మాట్లాడింది..
కానీ, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలిపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పడేయాలని చూస్తోంది. దాని స్థానంలో ‘మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధిని’ నినాదంగా ఎంచుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ నినాదాన్ని ప్రజలు తప్పక ఆదరిస్తారని జగన్ బలంగా నమ్మారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.
Ashwagandha : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!
ఇప్పటి నుంచే ప్రణాళికలు :
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రతిపక్షాలు తప్పకుండా ప్రశ్నిస్తాయి. అందుకోసం జగన్ ప్రభుత్వం ప్రజలను ఎలా మెప్పించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ‘మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి’ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారి కృషిని చూపించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధిపై రెండు సార్లు అసెంబ్లీ, మండలిలో సమావేశం నిర్వహించి మరీ చట్టం చేసినట్టు ప్రచారం చేయాలని చూస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఈ అంశం న్యాయ సమీక్ష కోసం వెళ్లగా, హైకోర్టులో కేసు నడుస్తోంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చినా, ప్రతిపక్షాలు మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ సుప్రీంలో సవాల్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్ష టీడీపీ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఎన్నికల్లో దోషిగా చిత్రీకరించేందుకు వైసీపీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read More : Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.