Viral video : ఇంటర్నెట్ ప్రపంచ ఆహ్లాదకరమైన ప్రపంచం. అక్కడ కొట్టి వేల కోట్ల వీడియోలను మనం చూడొచ్చు. రోజుల తరబడి చూస్తునే ఉండొచ్చు. మనకు నచ్చిన వీడియోను చూస్తూ… నవ్వుతుంటాం, ఏడుస్తుంటాం, ఆలోచిస్తుంటాం. కొన్ని సార్లు విన్యాసాలు వంటివి చూసి ఆశ్చర్యపోతుంటాం కూడా. అలాంటి వఓ వీడియోను చూసే ప్రస్తుతం సోషల్ మీడియా అంతా నవ్వుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా కచ్చితంగా నవ్వుతారు. అయితే ఈ వీడియో ఏంటి, అందులో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Viral video
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి తమకు వచ్చిన కళలను ప్రపంచానికి చూపించుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు. కొందరు సల్ఫీ వీడియోలు, రీల్స్, వీడియోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరేమో ప్రమాదకరమైన ప్రదేశాల్లో స్టంట్లు చేస్తూ… ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి బైక్ పై స్టంట్ చేస్తూ… సెల్ఫీ తీసుకోబోయాడు. హైవేపై ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా… వెనకాల ఓ వ్యక్తి నిల్చొని సెల్ఫీ తీసుకోబోయాడు.
అంతలోనే ముందున్న వ్యక్తి హ్యాండిల్ వదిలి పెట్టి వెనక్కి తిరిగి కూర్చున్నాడు. అతను కూడా ఓ ఫోన్ తీస్కొని సెల్ఫీలు తీస్కోవడం ప్రారంభించాడు. కానీ బైక్ బ్యాలెన్స్ కాకపోవడంతో బొక్క బోర్లా పడ్డారు. వెనకున్న వ్యక్తి బైక్ ను నియంత్రించాలని చూశాడు కానీ అతనూ ఆపలేకపోయాడు. ఆ తర్వాత బైక్ పక్కన ఉన్న ఓ గుంతలో పడిపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
AdvertisementView this post on Instagram
Advertisement
Read Also : Viral video: కోల్ కతా ఎయిర్ పోర్టులో సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేసిన నటి.. అదిరే స్టెప్పులేస్తూ