Yashoda Movie Review : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన యశోద మూవీ (శుక్రవారం) నవంబర్ 11, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది. సరోగసి నేపథ్యంలో వచ్చిన యశోద మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడటంతో సమంత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశోద ట్రైలర్‌కి విశేష స్పందన కూడా వచ్చింది. సమంత మూవీ సరోగసి నేపథ్యంలో సాగే కథాంశంగా వచ్చింది. సమంత అనుకోని పరిస్థితుల్లో అద్దెగర్భం దాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది.. తనకు ఎదురైన సమస్యల నుంచి ఎలా తనను తాను కాపాడుకుంది అనేది యశోద కధాంశం.. ఇంతకీ సమంత యశోద ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
స్టోరీ (Story) :
మధ్య తరగతి అమ్మాయి పాత్రలో యశోద (సమంత) అద్భుతంగా నటించింది. అనుకోని పరిస్థితుల్లో డబ్బు అవసరం పడుతుంది. ఆ సమయంలో తాను డబ్బులు కోసం సరోగేట్ (అద్దె గర్భం దాల్చేందుకు) అయ్యేందుకు అంగీకరిస్తుంది. సమంత గర్భం దాల్చిన తరువాత ఆమె వైద్యులు అనేక జాగ్రత్తలు సూచిస్తారు. తమ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని యశోదను హెచ్చరిస్తారు. సరోగసీ విషయంలో అనేక చేదు నిజాలను యశోద తెలుసుకుంటుంది. దాంతో యశోద చిక్కుల్లో పడుతుంది. యశోదను నిర్మూనుష్యమైన అడవిలో వదిలేస్తారు. అక్కడి నుంచి యశోద ఎలా ప్రాణాలతో బయటపడింది అనేది మిగతా స్టోరీ..
నటీనటులు వీరే :
Movie Name : | Yashoda (2022) |
Director : | హరి – హరీష్ |
Cast : | సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ |
Producers : | శివలెంక కృష్ణ ప్రసాద్ |
Music : | మణిశర్మ |
Release Date : | 11 నవంబర్ 2022 |
యశోదగా సమంత నటించగా.. రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, సంపత్ రాజ్, ఉన్ని ముకుందన్, శత్రు, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, కల్పికా గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. యశోద మూవీకి హరి – హరీష్ దర్శకత్వం వహించగా.. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించగా.. మణిశర్మ మ్యూజిక్ అందించారు.
యశోద మూవీ ప్రారంభంలోనే అనేక ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. యశోదకు సరోగసికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా తెలియడం మొదలుకాగానే మూవీ కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. ప్రేక్షకులకు మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి మెయిన్ స్టోరీలోకి మారడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతా ఆస్పత్రి వాతావరణంలో సాగే ఈ మూవీ చూసే ప్రేక్షకులకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ మూవీలో సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందనే క్యూరాసిటీ ప్రేక్షకుల్లో అనిపించేలా చేస్తుంది. ప్రధానంగా మాతృత్వానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. ప్రతి సన్నివేశంలోనూ సమంత తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘సరోగసీ’ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో లేని ఎన్నో సీన్లు ఇందులో ఉన్నాయి. మన జీవితానికి దగ్గరగా ఉండేలా ఉండటంతో ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే యశోద మూవీలో కొన్నిచోట్ల సీన్ల విషయంలో ఇదంతా నిజంగానే జరుగుతుందా? అనిపించేలా ఉన్నాయి.
సరోగసి స్కామ్ వెనుక ఎవరున్నారో యశోద తెలుసుకునే ప్రయత్నాలు చేసిన సన్నివేశాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక్కో సీన్‌లో ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సమంత నటన విషయానికి వస్తే.. యశోద పాత్రలో సమంత బాగా చేసింది. యశోద పాత్రలో అనేక వేరేయేషన్లు ఉన్నాయి. సరోగసి బాధితురాలిగా సమంత భావోద్వేగాన్ని బాగా పండించింది. సమంత తనను తాను రక్షించుకునేందుకు చేసిన కొన్ని ఫైట్ సీన్లు అద్భుతంగా వచ్చాయి. ఇతర నటీనటుల్లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, మధురిమ, కల్పికా గణేష్, ప్రియాంక శర్మ, సంపత్ రాజ్, శత్రు, దివ్య శ్రీపాద తమ పాత్రల్లో నటించి మెప్పించారు. దర్శకుడు హరి – హరీష్ మంచి స్టోరీని తీసుకున్నారు. స్టోరీ విషయంలో కొన్నిచోట్ల ట్రాక్ తప్పింది అనే భావన కలిగినప్పటికీ.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
వాస్తవానికి నిజ జీవితంలో చాలా మంది బాధితులకు సరోగేట్ వెనుక ఎలాంటి వ్యవహారాలు జరుగుతాయనేది పెద్దగా తెలియకపోవచ్చు. అసలు సరోగేట్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఈ మాయలో అమాయక మహిళలు ఎలా బాధితులవుతున్నారు అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారు. టెక్నికల్ విషయానికి వస్తే.. యశోద మూవీ బాగా వచ్చింది. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మణిశర్మ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. ఓవర్ ఆల్‌గా యశోద ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. యశోద సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, నటన, యాక్షన్ సీక్వెన్సులు ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. కొన్ని సీన్లను బాగా సాగదీసినట్టు కనిపించాయి. ప్రతిఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి చూడదగిన సినిమా అని చెప్పవచ్చు.
[ Tufan9 Telugu News ]
యశోద మూవీ రివ్యూ & రేటింగ్ : 3.2/5
Read Also : Ori Devuda Movie Review : ‘ఓరి దేవుడా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.