Viral dance : నటరాజ స్వామిని గుర్తు చేసిన నాట్య మయూరి.. ఎలా చేసిందో చూడండి!

Viral dance
Viral dance

Viral dance : ఈ మధ్య చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. అందంగా ముస్తాబై రీల్స్, నటన, డ్యాన్స్, పాటలు వంటి వాటితో అదరగొడ్తున్నారు. ఒక్క రాత్రిలోనే స్టార్ లు అయిపోతున్నారు. ఎన్నో రకాల డ్యాన్సులతో అదరగొడ్తున్న యువత.. క్లాసికల్ డ్యాన్స్ జోలికి మాత్రం వెళ్లట్లేదు. చేసే వాళ్లు, చూసే వాళ్లు కూడా చాలా తగ్గిపోతున్నారు. అయితే ఈ విషయాన్న అర్థం చేసుకున్న ఓ మహిళ… తన డ్యాన్స్ ద్వారా అందరినీ ఆకర్షించి.. వారు కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేలా చేయాలని నిర్ణయించుకుంది.

Viral dance
Viral dance

అనుకున్నదే తడవుగా యూట్యాబ్ వేదికగా తాను చేసిన డ్యాన్స్ వీడియోను తన ఛానెల్ లో పెట్టుకుంది. క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించిన వస్త్ర ధారణలో.. కళ్లు, కాళ్లు, నడుము, చేతులు, ముద్రలు, పలు రకాల భంగిమలతో నాట్య మయూరిలా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా… నటరాజ స్వామిని గుర్తు చేశావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత బాగా క్లాసికల్ డ్యాన్స్ చేసిన వాళ్లని చూడడం ఇదే మొదటి సారి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Read Also : Anchor varshini : బుట్ట బొమ్మలా.. ముద్దుగా తయారైన యాంకర్ వర్షిణి!

Advertisement