Viral Video : బుల్లెట్ బండి పాటకు నెల్లూరు కవిత డాన్స్.. కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది.. వీడియో వైరల్!

Viral Video : పెళ్లికూతురు బుల్లెట్ బండి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట ట్రెండ్ అవుతోంది. ఇప్పటి పెళ్లిళ్లలోనూ పెళ్లికూతుళ్లు తప్పకుండా ఈ పాటకు డాన్స్ చేయాల్సిందే. బుల్లెట్ బండి పాటకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేస్తూ తమ సోషల్ అకౌంట్లలో పోస్టులు పెడుతుంటారు.

viral-video-nellore-kavitha-mind-blowing-dance-performance-for-bullet-bandi-song-video-goes-viral
viral-video-nellore-kavitha-mind-blowing-dance-performance-for-bullet-bandi-song-video-goes-viral

యవతీ యువకులంతా ఈ పాట వినిపిస్తే చాలు.. స్టెప్పులేయకుండా ఉండలేరంటే అంతగా జనాల్లో కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ పాటకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కండెక్టర్ ఝాన్సీ డాన్స్ తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అలానే నెల్లూరు కవిత కూడా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన నెల్లూరు కవిత బుల్లెట్ బండి పాటకు వేసిన డాన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

Viral Video : నెల్లూరు కవిత డాన్స్ పర్ఫార్మెన్స్ అదరహో.. 

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి పాటకు స్టేజీపై తనదైన స్టయిల్‌లో స్టెప్పులేస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. టాలెంట్ ఉన్న ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. సరైన గుర్తింపు లేక వెనుకబడిపోతున్నారు. మొన్న ఝాన్సీ, ఇప్పుడు నెల్లూరు కవిత.. ఇలాంటి వారెందరో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు.

viral-video-nellore-kavitha-mind-blowing-dance-performance-for-bullet-bandi-song-video-goes-viral
viral-video-nellore-kavitha-mind-blowing-dance-performance-for-bullet-bandi-song-video-goes-viral

శ్రీదేమి డ్రామా కంపెనీ టీవీషోలో మాస్ డాన్సుతో ఇరగదీసిన నెల్లూరు కవిత.. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తోంది. స్టేజ్ షోలలో తన డాన్సుతో యువతను అలరిస్తోంది. నెల్లూరులోని ఓ ఈవెంట్ సందర్భంగా నెల్లూరు కవిత బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసింది. జీన్స్ ధరించి చక్కగా పాటకు స్టెప్పులేస్తూ సందడి చేసింది. ఇప్పుడు ఆ వీడియోకు సోషల్ మీడియాలో వేలకొలది వ్యూస్, కుప్పల కొలది కామెంట్లు వచ్చిపడుతున్నాయి. మీరు కూడా నెల్లూరు కవిత వేసిన బుల్లెట్ బండి పాట వీడియోను ఎంజాయ్ చేయండి..

Read Also : RGV Vyuham Movie : ‘వ్యూహం’ మూవీ రియల్ స్టోరీ ఇదేనట.. ఆర్జీవీ లెక్కల ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వర్మ టార్గెట్ ఎవరంటే?!