...

Viral Video : తల్లి కోసం పరితపిస్తున్న చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లలాగవు.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: పసి పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎంత ఇష్టం ఉంటుందో తల్లిదండ్రులన్న పిల్లలకు అంతే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా తల్లి తల్లి అంటే పిల్లలకు మరింత ప్రేమ ఉంటుంది. వారు కొంతసమయం కనిపించకపోయినా కూడా తల్లడిల్లి పోతారు. అలాంటి పసిపిల్లలు కొంతమంది శాశ్వతంగా వారి తల్లులను శాశ్వతంగా కోల్పోతున్నారు. వారి ఎప్పటికి తిరిగి రారని తెలియక వారికోసం ఆరాటపడుతు ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్స్ కి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ వీడియోలో ఒక చిన్నారి తన తల్లి కోసం పడే ఆరాటం చుస్తే గుండె బరువెక్కి పోతుంది .

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తన తల్లి సమాధి వద్దకు వెళ్లి తన తల్లి ఎక్కడ ఉందని అమ్మమ్మని అడగ్గా.. ఆమె భూమిలో పడుకుందని సమాధానం చెబుతుంది. దీంతో ఆ చిన్నారి తన అమ్మని చూడటానికి అరటపడుతు తన తల్లి భూమిలో నిద్రపోతుందనీ భావించి భూమిలో గొయ్యి తవ్వి తన తల్లిని చూడటానికి ఆరాట పడుతున్నాడు. అమ్మా అమ్మా అని ఎంత పిలిచినా కూడా తన తల్లి పలకక పోయేసరికి అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడుస్తున్నాడు.

Viral Video:

ప్రస్తుతం ఈవీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ చిన్నారిని చూసి బాధపడుతున్నారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలకు దేవుడు తల్లిని దూరం చేసి వారికి అన్యాయం చేస్తున్నాడు. ఇలా ఎంతోమంది పసి పిల్లలు తల్లి ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది