Guppedantha Manasu: అడ్డంగా దొరికిపోయిన గౌతమ్.. వసు దగ్గరికి వెళ్లిపోయిన జగతి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతికి మహేంద్ర నచ్చ చెబుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర ఆరోజు కూడా సాక్షి ప్రెస్ మీట్ లో ఎంగేజ్మెంట్ గురించి బయట పెడితే రిషి సీరియస్ అయ్యాడు కదా నేనెందుకు చెబుతున్నాను అర్థం చేసుకో జగతి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనడంతో నువ్వు ఎన్నైనా చెప్పు మహేంద్ర ఈరోజు నేను అక్కడికి వెళ్లకపోతే రిషి నన్ను ఇంకా అసహ్యించుకుంటాడు అని అంటుంది. అప్పుడు మహేంద్ర సరే నీ ఇష్టం జగతి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార రెడీ అవుతూ అద్దంలో తనని తానే చూసుకుంటూ పొగుడుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇంతలోని రిషి అక్కడికి రావడంతో వెళ్దాం పదండి సార్ అని అనగా వెంటనే వసు నుదుటి పై బొట్టు లేకపోవడం చూసిన రిషి వధారకు దగ్గర వెళ్తూ ఉంటాడు. అప్పుడు వసుధార టెన్షన్ పడుతూ ఉండగా వెంటనే అద్దంపై ఉన్న బొట్టుని వసు నుదుటి పై పెట్టి బొట్టు మరిచిపోయావు అని అంటాడు. ఆ తర్వాత వసు కి ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రమే ఇంటర్వ్యూలో ధైర్యంగా ఎందుకు అని చేతిలో చేయి వేసి ధైర్యం చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి అది చూసిన దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు నన్ను రిషి మీ పెదనాన్న బయలుదేరారు వెళ్లారు అనడంతో మేము కూడా వెళ్తున్నాం పెద్దమ్మ మీరు వసుధారకి ఆల్ ది బెస్ట్ చెప్పరా అని అనటంతో వెంటనే దేవయాని రిషి కోసం లోపల కుళ్ళుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ వసుధారకి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. మరొకవైపు కాలేజీలో వసుధార ప్రెస్ మీట్ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అక్కడ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఇంతలోనే గౌతమ్ కి ఫోన్ చేయడంతో గౌతమ్ ఫోన్ పనింద్ర లిఫ్ట్ చేయగా అప్పుడు మహేంద్ర తన అన్న వాయిస్ విని వెంటనే కట్ చేస్తాడు.

ఆ తర్వాత రిషి రావడంతో అసలు విషయం చెప్పగా రిషి వెంటనే గౌతమ్ ఫోన్ లాక్కొని ఫోన్ చేయగా మహేంద్ర ఏం మాట్లాడకుండా రిషి వాయిస్ విని మౌనంగా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ అందరి ముందు అడ్డంగా బుక్కయ్యాను కదా అనుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. అబద్ధాలు చెప్పి గౌతమ్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత వసుధర ఆలోచించుకుంటూ జగతి వాళ్ల గురించి బాధపడుతూ వెళ్తూ ఉండగా అప్పుడు గౌతమ్ వసు పిలిచినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి అక్కడికి వచ్చి వసుధారకు ధైర్యం చెప్పి లోపలికి పిలుచుకొని వెళ్తాడు.

Advertisement

మరొకవైపు జగతి కనిపించకపోయేసరికి మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జగతి రాసిన లెటర్ ని చదివి మహేంద్ర కోపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుదారకు ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అన్నది విషయం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ విలేకరుల మాదిరిగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మరొకవైపు వసుధార దగ్గరికి జగతి వస్తూ ఉంటుంది.

Advertisement