Telugu NewsLatestGuppedantha Manasu: వసుధారని మాటలతో బాధపెట్టిన కాలేజీ స్టాప్.. దేవయాని నిజస్వరూపం బయట పెడతానన్న వసు?

Guppedantha Manasu: వసుధారని మాటలతో బాధపెట్టిన కాలేజీ స్టాప్.. దేవయాని నిజస్వరూపం బయట పెడతానన్న వసు?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార నీ హెడ్గా నియమించడంతో రిషి సంతోషపడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని కాలేజీ స్టాప్ ని రెచ్చగొడుతూ కొన్ని కొన్ని సార్లు మనం ఓడిపోతూ అవతల వారిని గెలిపించాలి. ఇప్పుడు జరిగింది అదే ఇక్కడ వసుధార కాదు గెలిచింది నేను అని అంటుంది దేవయాని. రిషి నా మాట కాదు అనడు ఏది చెబితే అది వింటాడు వసుధార గెలిచింది అంటే రిషి కూడా ఆటోమేటిక్గా సంతోషపడతాడు అప్పుడు రిషి నన్ను పొగుడుతూ మాట్లాడతాడు అని అంటుంది దేవయాని. ఇంతలోనే కాలేజీ స్టాప్ మేడం మీరు ఇవన్నీ బాగానే చెబుతున్నారు ఇప్పుడు ఆ వసుధర హెడ్గా గా ఉంటే మనమందరం క్లాప్స్ కొట్టాలా అని అనగా మీరు ఈ దేవయాని ని చాలా అంచనా వేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం వాళ్లు స్థానం దక్కింది అన్న సంతోషంలో ఏమని పాటుగా ఉంటారు ఈ సమయంలో మనం ఊహించని దెబ్బ కొట్టాలి అని వారికి ప్లాన్ చెబుతుంది దేవయాని. మరొకవైపు జగతి, వసుధార లు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు జగతి సంతోష పడుతూ ఉంటుంది. కంగ్రాట్యులేషన్స్ వసు నువ్వు సాధించావు అని జగతి అనగా ఈ విజయం నాది కాదు మేడం మీది రిషి సార్ది అని అంటుంది. అదేంటి వసుధర అనడంతో మా విజయం వెనుక ఉన్నది నువ్వు రిషి సారే కదా మేడం అని అంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కాలేజీ స్టాఫ్ వస్తారు.

Advertisement

అప్పుడు వారు కావాలనే వెటకారంగా కంగ్రాట్యులేషన్స్ వసుధార అనుకున్నది సాధించావు కదా అనగా వెంటనే వసుధార నేను గెలవకూడదని చాలామంది చాలా విధాలుగా అనుకున్నారు లేండి మేడం అని అంటుంది. అప్పుడు ఒక మేడం నీ తెలివి చూస్తే ముచ్చటేస్తోంది వసుధారా అనగా తెలివి కాదు మేడం మేధస్సు అంటే బాగుంటుందేమో అని అనగా ఏం మాట్లాడుతున్నారు మేడం అని వసుధార అనడంతో ఉన్నదే కదా వసుధార మాట్లాడుతున్నాము నువ్వు ఎవరినైనా ఇట్టే వలలో వేసుకుంటావు అనగా వసుధర షాక్ అవుతుంది.

రిషి సార్ ని బుట్టలో వేసుకొని తన వీక్నెస్ లు అని తెలుసుకుని సార్ ని గుప్పెట్లో పెట్టుకున్నావు కదా అనగా వసుధార సీరియస్ అవుతుంది. అప్పుడు వెంటనే కాలేజీ స్టాఫ్ వాళ్ళు మేము మాట్లాడుతున్న దాంట్లో తప్పేముంది వసుధర నువ్వు చేస్తున్నది అదే కదా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా షికార్లు చేయడం మాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు వస్తదారా సీరియస్ అయ్యి ఆపుతారా మీరు ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా మర్యాదగా ఉండదు ఇకనుంచి బయటికి వెళ్లిపోండి మీరు లెక్చరర్స్ అయి సరిపోయింది మీ స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే సమాధానం వేరేలా ఉండేది అని వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది వసుధార.

Advertisement

ఆ తర్వాత వసుధార ఆటోలో వెళుతూ జరిగిన విషయాలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. మరొక వైపు రిషి వసుధార కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో మహేంద్ర ఎదురు పడటంతో వసుధార కనిపించిందా డాడ్ అనగా ఇప్పుడే గేటు వైపు వెళ్ళింది రిషి అని చెబుతాడు. మరొకవైపు వసుధార, జగతి ఒడిలో తలపెట్టుకొని పడుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు జగతి హోదాడుస్తూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి గురు శిష్యులు ఈ విధంగా ఉంటే నాకు చూడడానికి ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడంతో అక్కయ్య గారు వసుధార ఇప్పటికే బాధలో ఉంది మీరు తనని ఏమీ అనకండి అని అంటుంది జగతి.

అప్పుడు కావాలనే దేవయాని వసుధారని దెప్పి పొడిచే విధంగా మాట్లాడుతుంది. ఇంత జరిగినా కూడా నువ్వు సిగ్గు లేకుండా మళ్లీ ఇదే ఇంటికి వస్తావని అనుకోలేదు వసుధారా అని అనడంతో జగతి షాక్ అవుతుంది. అప్పుడు జగతి మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అని అనడంతో మర్యాద అంటే ఏంటి జగతి అర్ధరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటకి వెళ్లి తిరగడమా అని అడుగుతుంది. అప్పుడు వసుధార కోపంతో మీ ఇంటికి వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి మేడం చెప్పండి అని నిలదీస్తుంది. వెంటనే దేవయాని సరైన పాయింట్ పట్టుకున్నావు వసుధార నువ్వు ఈ ఇంటికి ఏ అధికారంతో వచ్చావు ఎందుకోసం ఉంటున్నావు అడగగా వసుధార మౌనంగా ఉంటుంది.

Advertisement

అప్పుడు వసుధార కోప్పడుతూ మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే స్థానంతో ఇదే ఇంట్లో మళ్ళీ నేను తిరిగి అడుగు పెడతాను అంతేకాకుండా మీరు చేస్తున్న బాగోతాలు మీ బుద్దులు అన్ని రిషి సార్ ముందు బయట పెడతాను అని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు ధరణి ఎంత పిలుస్తున్న వసుధార పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వసుధార కోసం రిషి ఫ్లవర్ బొకే తీసుకొని వస్తూ ఉంటాడు.

ఆ తర్వాత దేవయాని హాల్లో కూర్చుని సంతోషపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణిని రమ్మని చెప్పి పిలుస్తుంది. అత్తయ్య కాఫీ కావాలా అని అడగబోతుండగా నేను కాఫీలు తాగడానికి పుట్టలేదు నువ్వు కాఫీలు తయారు చేయడానికి పుట్టలేదు అనగా ఏమో అత్తయ్య నాకు తెలియదు అని అనగా నువ్వు ఎన్ని వెటకారంగా మాట్లాడిన నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది దేవయాని.

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు