Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌర్య చారుశీల దగ్గరికి బయలుదేరుతుంది.
ఈరోజు ఎపిసోడ్లో శౌర్య చారుశీల దగ్గరికి వస్తుంది. ఏంటి జ్వాలా ఇలా వచ్చావు మళ్లీ తలనొప్పిగా ఉందా అని అడగగా లేదు మేడం మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుంది చెప్పమ్మా ఏంటి అని అడగగా సౌర్య తన చేతిలో ఉన్న పోస్టర్ ని చూపించడంతో చారుశీల బాధపడుతుంది. అప్పుడు సౌర్య మా అమ్మ నాన్నలు కనిపించడం లేదు డాక్టర్ వాళ్ళ కోసం చాలా వెతుకుతున్నాను వాళ్లు కూడా నా కోసం వెతుకుతున్నారు.
ఇది హాస్పిటల్ పెద్దది కదా డాక్టర్ మా అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తారేమో అని ఆశగా ఉంది ఈ పోస్టర్ ని మీ హాస్పిటల్లో అతికించవచ్చా అని అడగగా సరే అమ్మ అని అంటుంది. ఇక్కడే కాదు ఊరు మొత్తం అతికించాను. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు అని శౌర్య బాధగా మాట్లాడడంతో చారుశీల శౌర్య బాధను చూసి బాధపడుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చే టైం అయింది అనుకున్న చారుశీల సౌర్య ని పక్కనే ఉన్న ఒక అతన్ని ఇంటి దగ్గర దింపమని చెప్పి అక్కడ నుంచి పంపిస్తుంది. మరొకవైపు సౌందర్య అంజి ఇద్దరూ హాస్పిటల్స్ మొత్తం వెతుకుతూ దీప కార్తీక్ ల కోసం వెతుకుతూ ఉంటారు
అప్పుడు దీప వాళ్ళు కనిపించకపోయేసరికి సౌందర్య నిరాశపడుతూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి అమ్మ కార్తీక్ సార్ వాళ్లకు తప్పకుండా దొరుకుతారు అని అంజి అనడంతో నీ నోటి చలువ వల్ల దొరికితే బాగుండు అంజి అని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు హాస్పిటల్లో శౌర్య అతికించిన పోస్టర్ని చూసిన కార్తి నేను ఎంత దుర్మార్గుడినో నా కూతురు మా కోసం ఇంత తపన పడుతున్నా కూడా తనని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
తల్లి కోసం బిడ్డ బిడ్డ కోసం తల్లి ఎంత తాపత్రయపడుతున్నారో చూసి ఏం చేయలేకపోతున్నాను చారుశీల అని ఏడుస్తూ ఉండగా వెంటనే చారుశీల అయితే ఇద్దరిని ఒకటి చెయ్ అసలు నిజం చెప్పే కార్తీక్ అనడంతో ఆశ్చర్యపోతాడు. నిజం చెప్పలేక కదా వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నావు మరి అలాంటప్పుడు ఎందుకు బాధ పడతావు కార్తీక్ ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతుంది చారుశీల. మరొకవైపు దీపకీ పండరీ టాబ్లెట్స్ ఇవ్వగా ఏంటి దీపమ్మ ఎప్పుడు ఇలాగే అశోక వనంలో సీతమ్మ కూర్చున్నట్టు కూర్చుంటావు అని అనగా నాకు ఆమెకు పెద్ద తేడా లేదు పండరి.
సీతమ్మ రాముల వారి కోసం ఎదురు చూస్తే నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను అని అనగా వెంటనే ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావు దీపమ్మ అని అంటుంది. సరే పండరీ నువ్వు నాకు నా బిడ్డను వెతకడంలో సహాయపడాలి అని అనగా సరే అని అంటుంది. నువ్వు రావాల్సిన అవసరం లేదు దీపమ్మ నీ బిడ్డ ఫోటో చూపించు చాలు ఊరు మొత్తం జల్లెడ వెతికి పట్టి మరి నీ బిడ్డను తీసుకువస్తాను అని అంటుంది. ఇప్పుడు నీ బిడ్డ ఫోటో చూపించు అనగా దీప లోపలికి వెళ్లి సౌర్య ఫోటో తీసుకొని రావడంతో శౌర్య ఫోటో చూసిన పండరి ఈ పాపనా వీళ్ళు నాకు తెలుసు అనగా ఎంతటి శుభవార్త చెప్పావు పండరి అని అంటుంది.
ఎక్కడ చూసావు అనగా ఈ మధ్యనే మా ఇంటికి దగ్గరలో వీళ్ళు దిగారు చంద్రమ్మ ఇంద్రుడు దంపతులే కదా వీళ్ళు అనగా అవును అని అంటుంది దీప. సరే వెంటనే నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళు అనడంతో సరే అని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు కార్తీక్ సౌర్య అతికించిన పోస్టర్ ని చూసి బాధపడుతూ ఉండగా ఇంతలో దీప ఫోన్ చేసి సౌర్య ఆచూకీ తెలిసింది డాక్టర్ బాబు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ దీప అనడంతో ఆ ఇంద్రుడు చంద్రమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది ఇప్పుడు నేను పండరి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అనడంతో కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనగా నేను పండరీ వెళ్తున్నాము అని పండరి ఒక అడ్రస్ వస్తుంది అక్కడికి వచ్చే డాక్టర్ బాబు అని అంటుంది దీప.