Guppedantha Manasu Dec 2 Today Episode : ప్రేమలో మునిగి తేలుతున్న వసు, రిషి.. గౌతమ్ నీ నిలదీసిన రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవ్వుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో వసుధార రిషి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి మా డాడ్ నా కళ్ళ ముందు ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. డాడ్ ఉన్నారు నువ్వు కూడా ఉన్నావు నాకు ఇంతకంటే ఏం కావాలి వసుధార అని అంటాడు రిషి. అప్పుడు మీ సంతోషమే నా సంతోషం సార్ అని అంటుంది వసుధార. ఆ తర్వాత వసుధార కారు పక్కకి ఆపమని చెప్పడంతో రిషి కారు ఆపుతాడు. ఏంటి వసుధార ఎందుకు ఆపమన్నావు అని అడగగా మీ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది సార్ ఆ కళ్ళలో ఎప్పటికీ ఆ ఆనందాన్ని అలాగే చూడాలని ఉంది అని అంటుంది. కార్ లో వెళ్తున్నప్పుడు ఆ కళ్లలోని ఆనందం చూడటం కష్టం అందుకే కారు ఆపమని చెప్పాను అని అంటుంది వసుధార.

ఆ తర్వాత వసుధార రిషి చేయి పట్టుకొని మనసుకు నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అని అంటుంది. ఆ తర్వాత వసుధారసి ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ప్రేమలో మునిగితేలుతూ ఉండగా ఇంతలో అక్కడికి కొందరు ఆకతాయిలు వస్తారు. లవ్ బర్డ్స్ కి ఎక్కడ రూమ్స్ దొరకలేదా అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో ఆ రౌడీ లను కొట్టి పంపిస్తాడు. ఆ తర్వాత రిషి షర్టుకి కొంచెం ఆల్కహాల్ అవ్వడంతో పక్కనే గౌతమ్ సార్ రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్లి మార్చుకుందాం అని అంటుంది వసుధార.

ఆ తర్వాత రిషి వసు ఇద్దరు కలిసి గౌతమ్ ఇంటికి వెళ్లడంతో ఇదేంటి వీడు ఈ టైంలో వచ్చాడు అని అనుకుంటూ టెన్షన్ టెన్షన్ గా డోర్ తీస్తాడు గౌతమ్. రిషి దగ్గర కొంచెం ముందు స్మెల్ రావడంతో ఏంట్రా తాగి వచ్చావా అని అనగా నాకు ఒక టీ షర్టు గాని షర్ట్ గాని కావాలి అని అడుగగా లోపలికి వెళ్లి మార్చుకో అని అంటాడు గౌతం. మరొకవైపు దేవయాని వెళ్లిపోయింది అనుకున్న జగతి మళ్ళీ వచ్చింది అని కోపంతో రగిలిపోతూ నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లగా అప్పుడు జగతి గదిలోకి తొంగి చూడడంతో అక్కడ ధరణి ఉండగా అది చూసి దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అదేంటి జగతి దగ్గర వసు ఉండాలి కదా మరి ధరణి ఉందేంటి అని అంటుంది వసుధార. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళ్లారా అనుకుంటూ రిషి కార్ కోసం చూడగా రిషి కారు కూడా లేకపోవడంతో ఈ రిషికి రాను రాను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని కోపంతో తగిలిపోతూ ఉంటుంది దేవయాని. మరొకవైపు రిషి టీ షర్టు మార్చుకొని బయటికి రావడంతో అదేం బాగోలేదు వెళ్లి వేయ టీ షర్టు మార్చుకొని రా అనగా నా ఇష్టం అని అనడంతో సరే అని అంటాడు గౌతమ్. ఆ తర్వాత రిషి తన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో లోపలికి వెళ్తాడు. అక్కడ మహేంద్ర వాడిన పర్ఫ్యూమ్, వాచ్ అలాగే ఫోటో ఉండడంతో రిషి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.

వాచ్ నేను దాడికి ఇచ్చింది కదా మరి ఇక్కడ ఉందేంటి అంటే డాడ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారా అనుకునే కోపంతో బయటకి వెళ్తాడు రిషి.. మిత్ర ద్రోహి ఎంత మోసం చేసావురా నేను డాడీ కోసం ఎంత ఆరాటపడుతున్నానో చూసి కూడా నాకు అబద్ధం చెప్పావు. నువ్వు అసలు ఫ్రెండ్వేనా అంటూ గౌతమ్ మీద విడుచుకుపడతాడు రిషి ఇప్పుడు గౌతమ్ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ మాట్లాడకు అంటూ రిషి సీరియస్ అవుతాడు.