Telugu NewsLatestIntinti Gruhalakshmi: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న శృతి.. ప్రేమ్ చెంప చెల్లుమనిపించిన తులసి.?

Intinti Gruhalakshmi: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న శృతి.. ప్రేమ్ చెంప చెల్లుమనిపించిన తులసి.?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సామ్రాట్ జరిగిన విషయాన్ని తలుచుకొని ఆనందపడుతూ ఉంటాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. రొకవైపు పరంధామయ్య కూడా జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రేమ్ రావడంతో ప్రేమతో తన బాధలు చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు పరంధామయ్య. తులసి గురించి ఎవరైనా పట్టించుకున్నారా కనీసం తనని ఓదార్చారా అని బాధపడుతూ ఉంటాడు.

Advertisement

Advertisement

ఆ తర్వాత నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పదందామయ్య. మరుసటి రోజు ఉదయం అనసూయని టాబ్లెట్లు వేసుకోమని చెబుతుంది తులసి. అప్పుడు అనసూయ నాకు రోగం తగ్గడానికి టాబ్లెట్స్ ఉన్నాయి. కానీ బయట వాళ్ళు నోరు మూయించడానికి ఏం లేదు కదా అని అనడంతో అవన్నీ పక్కన పెట్టండి మీరు టాబ్లెట్లు వేసుకోండి అని అనసూయ ఏదో టాబ్లెట్లు మింగిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఆడవాళ్లు అక్కడికి వచ్చి మా కోడలికి సీమంతం తులసి రా అని చెప్పి ఆహ్వానించి వెళ్తారు.

Advertisement

నా కోడలు పెళ్లయిన నాలుగు నెలలకి శుభవార్త చెప్పింది నేను చాలా ఆనందంగా ఉన్నాము మరి మీ పిల్లల సంగతి ఏంటి అని అనగా తులసి మౌనంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోగానే తులసి కొడుకు కోడళ్లను పిల్లల గురించి అడుగుతుంది. దాంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడంతో ఏం జరిగింది అందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది తులసి. అప్పుడు శృతి అసలు విషయాన్ని చెప్పబోతూ ఉండగా ఇంతలో ప్రేమ్ అలా ఏం లేదమ్మా దేవుడు కూడా కరుణించాలి కదా అంటూ అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత తులసి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

ఆ తర్వాత తులసి బ్యాగ్ వేసుకుని బయలుదేరుతూ ఉండగా అనసూయ ఎక్కడికి అని అడుగుతుంది. ఆఫీస్ కి వెళ్తున్నాను అత్తయ్య అని అనడంతో నువ్వు ఇంకా మారవా ఎన్నిసార్లు చెప్పాలి తులసి ఎందుకు ఇలా మొండి పట్టు పడుతున్నావు అని అనసూయ అనడంతో వెంటనే తులసి అనసూయకు నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అనసూయ నేను చెబుదామంటే నాకే నచ్చచెబుతోంది ఏం చేయాలి దేవుడా అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత పరంధామయ్య సామ్రాట్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు పరంధామయ్య తులసి విషయంలో సామ్రాట్ ని ఒక హెల్ప్ అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ కి పరంధామయ్య కొన్ని పేపర్లు చూపించి ఆ విషయంలో హెల్త్ చేయమని అడగగా వెంటనే ఈ విషయం మీ ఇంట్లో చెప్పారా అని అడుగుతాడు. వెంటనే పరంధామయ్య లేదు ఈ విషయాన్ని ఇంకొక విధంగా చెప్పాలి అనుకుంటున్నాను ఈ లోపు నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు.

Advertisement

దానికి సామ్రాట్ సరే తప్పకుండా చేద్దాము అని అంటాడు. ఆ తర్వాత సీన్లో తులసి ఆఫీస్ కి వస్తుంది. అదే సమయంలో లాస్య నందు దగ్గర ఉంటుంది. మరొకవైపు ఆఫీస్ కి వచ్చిన తులసి మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్టు టైల్స్ కోసం వెతుకుతూ ఉండగా అక్కడ లేకపోవడంతో ఇంతలో అక్కడికి ఒక ఆమె రాగా మ్యూజిక్ స్కూల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అని అనడంతో లాస్ట్ మేడం దగ్గర ఉన్నాయి అని చెబుతుంది. దాంతో తులసి నందుల లాస్య ల దగ్గరికి వెళుతుంది.

Advertisement

రేపటి ఎపిసోడ్లో శృతి అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండగా వెంటనే తులసి ఆగు అని చెప్పి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తుంది తులసి. భార్యా అర్ధరాత్రి ఇల్లు దాటి వెళ్లిపోతుంటే కనీసం అది కూడా పట్టించుకోని మొగుడివి నువ్వే మగాడివి అంటూ ప్రేమ్ ని అవమానిస్తుంది. అప్పుడు తులసి నువ్వు నా కొడుకువి కాదు నందగోపాల కొడుకువి ఛీ పోరా అంటూ ఛీదిరించుకుంటుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు