Trending Video : నాడు పొట్టివాడే నేడు సూపర్ బాడీ బిల్డర్… చూస్తే అవాక్కవ్వాల్సిందే !

Trending Video : ప్రతి ఒక్కరికీ అనుకున్నది సాధించాలని ఉంటుంది. అయితే అందరూ అనుకున్నది సాధించ లేరు. సాధించాలి, గెలవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ కృషి కూడా ఉండాలి. అయితే ప్రతి ఒక్కరు తమలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కలలు కంటే సరిపోదు… వాటిని నెరవేర్చుకునే సత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి ముఖం చాటేస్తారు లేదంటే సాకులు వెతుక్కుంటారు.

అందుకే అద్భుతాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ కాలాన్ని వృధా చేస్తుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈ టీనేజ్ కుర్రాడు (tristyn-lee) మాత్రం కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. ఈ యంగ్ బాడీ బిల్డర్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అతను ఎవరు, ఆ స్టోరీ ఏంటో మీకోసం…

Tristyn-lee Viral Video : ఈ యంగ్ బాడీ బిల్డర్ వీడియో చూశారా?


అమెరికాకు చెందిన ట్రిస్టిన్ లీ 15 ఏళ్ల వయసులో ఫుడ్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. నిజానికి ట్రిస్టిన్ లీ (tristyn-lee) పొట్టిగా ఉంటాడు. దీంతో అందరూ అతన్ని ఆట పట్టిస్తూ ఉండేవారు. ఐతే లీ మాత్రం తనను చూసి నవ్విన వారికి గట్టి సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆ చిన్న మలుపు లీని ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా నిలబెట్టింది. ఐదేళ్లు కఠోర శ్రమ పడి బాడీ బిల్డర్ అయ్యాడు… తన బలహీనతను బలంగా మార్చుకున్నాడు.

Advertisement

అంతేకాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోతోంది. లీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య అతని శరీరాన్ని ఏ విధంగా ఇనుములా మార్చాడో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. నిజానికి లీ కొన్ని సంవత్సరాల క్రితం పిన్న బాడీబిల్డర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు కూడా. ప్రస్తుతం లీకి 19 ఏళ్లు ఉండగా అతని ఫిట్ నెస్ వీడియోను చూసిన యావత్తు ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తుతోంది.

Read Also : ఈ యోగ ముద్రలతో ఆరోగ్యప్రయోజనాలెన్నో..

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel